జర్మనీలో ఫిజియోథెరపిస్టులు, ఆక్యుపేషనల్ థెరపిస్టులకు ఉద్యోగావకాశాలు
- June 28, 2026
హైదరాబాద్: తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM) జర్మనీలో ఫిజియోథెరపిస్టులు (Physiotherapists), ఆక్యుపేషనల్ థెరపిస్టులు (Occupational Therapists) ఉద్యోగాల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. విదేశాల్లో వైద్య రంగంలో కెరీర్‌ను నిర్మించుకోవాలనుకునే వారికి ఇది మంచి అవకాశంగా అధికారులు పేర్కొన్నారు.
అభ్యర్థులు గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి DPT, BPT, MPT లేదా B.Sc.(Occupational Therapy) ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ పొందిన అనంతరం కనీసం ఒక సంవత్సరం నిరంతర వృత్తిపరమైన అనుభవం తప్పనిసరి. అభ్యర్థుల వయస్సు 43 సంవత్సరాల లోపు ఉండాలి. అలాగే జర్మన్ భాషలో B2 స్థాయి సర్టిఫికేట్ తప్పనిసరిగా కలిగి ఉండాలి.
ఎంపికైన అభ్యర్థులకు జర్మన్ లైసెన్స్ పొందే వరకు రికగ్నిషన్ కాలంలో నెలకు €2,500 నుంచి €2,900 వరకు వేతనం లభిస్తుంది. భారతీయ కరెన్సీలో ఇది సుమారు రూ.2.68 లక్షల నుంచి రూ.3.11 లక్షల వరకు ఉంటుంది. జర్మన్ లైసెన్స్ పొందిన తర్వాత నెలకు €2,800 నుంచి €3,500 వరకు (సుమారు రూ.3.00 లక్షల నుంచి రూ.3.75 లక్షల వరకు) వేతనం అందించనున్నారు.
వేతనంతో పాటు సంవత్సరానికి 25 నుంచి 30 రోజుల చెల్లింపు వార్షిక సెలవులు, యాజమాన్యం ద్వారా ఉచిత ఆరోగ్య బీమా (Health Insurance) వంటి సౌకర్యాలు కూడా కల్పించనున్నట్లు టామ్‌కామ్ తెలిపింది.
ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు తమ CV (బయోడేటా)ను [email protected] కు పంపవచ్చు. మరిన్ని వివరాల కోసం 9440049645, 9440051763, 9440052592, 9440052081 నంబర్లను సంప్రదించవచ్చు.
దరఖాస్తుదారులు టామ్‌కామ్ అధికారిక వెబ్సైట్ https://tomcom.telangana.gov.in ను సందర్శించవచ్చు. అలాగే https://forms.gle/CQFAdQFgGFb7FuVU9లింక్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు లేదా ఫ్లైయర్లోని QR కోడ్‌ను స్కాన్ చేసి కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది.
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలోని టామ్‌కామ్ ద్వారా నిర్వహిస్తున్న ఈ నియామక ప్రక్రియ విదేశాల్లో ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తున్న ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ నిపుణులకు ఒక మంచి అవకాశంగా భావిస్తున్నారు.
తాజా వార్తలు
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్‌లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..
- యూఏఈలో మైనర్ పిల్లల చర్యలకు పేరెంట్స్ దే బాధ్యత..!!
- 'డార్బ్' యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి..MoT పిలుపు..!!
- పాస్‌పోర్ట్ పోగొట్టుకోవడంతో 18 ఏళ్లు విమానాశ్రయంలోనే జీవించిన వ్యక్తి..
- VMC కీలక నిర్ణయం..శాకాహార నగరంగా మారనున్న వారణాసి..
- ఏపీ ఎయిర్‌పోర్టుల్లో మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్







