ఏపీ ఎయిర్‌పోర్టుల్లో మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్
- June 28, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులకు శుభవార్త. రాష్ట్రంలోని కీలక విమానాశ్రయాల్లో మద్యం విక్రయాలకు అనుమతి లభించింది. ఇకపై ఏపీ విమానాశ్రయాల్లో బార్లు వైన్‌షాపులు అందుబాటులోకి రానున్నాయి. ఇతర ప్రధాన నగరాల తరహాలో ప్రయాణికుల సౌకర్యం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తిరుపతి మినహా రాష్ట్రంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో ఈ సదుపాయం కల్పిస్తున్నారు. ఎక్సైజ్ శాఖ ప్రత్యేక నిబంధనలను రూపొందించి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వారంలోనే పూర్తి స్థాయి నోటిఫికేషన్ విడుదల కానుంది.
దరఖాస్తు ఫీజులు లైసెన్స్ వివరాలు
ఈ లైసెన్స్‌ల కోసం దరఖాస్తు చేసుకునే వారు నాన్-రిఫండబుల్ రుసుము చెల్లించాలి. బార్లకు 5 లక్షలు, వైన్‌షాపులకు 2 లక్షల రూపాయలను దరఖాస్తు ఫీజుగా నిర్ణయించారు. వార్షిక రద్దీని బట్టి బార్ల లైసెన్స్ ఫీజు ఉంటుంది. 20 లక్షల కంటే ఎక్కువ ప్రయాణికులు ఉంటే 25 లక్షలు, తక్కువ ఉంటే 15 లక్షల రూపాయలు చెల్లించాలి. వైన్‌షాపుల లైసెన్స్ ఫీజును మాత్రం కోటి రూపాయలుగా ఖరారు చేశారు. ఢిల్లీ, తెలంగాణ, మహారాష్ట్ర విధానాలను పరిశీలించాక ఈ ఫీజులు నిర్ణయించారు.
తాజా వార్తలు
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్‌లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..
- యూఏఈలో మైనర్ పిల్లల చర్యలకు పేరెంట్స్ దే బాధ్యత..!!
- 'డార్బ్' యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి..MoT పిలుపు..!!
- పాస్‌పోర్ట్ పోగొట్టుకోవడంతో 18 ఏళ్లు విమానాశ్రయంలోనే జీవించిన వ్యక్తి..
- VMC కీలక నిర్ణయం..శాకాహార నగరంగా మారనున్న వారణాసి..
- ఏపీ ఎయిర్‌పోర్టుల్లో మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్







