యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- June 29, 2026
యూఏఈ: ఈ ఆగస్టులో యూఏఈ నుండి భారత్ కి ప్రయాణించే వారు తమ గమ్యస్థానాన్ని బట్టి విమాన ఛార్జీలలో భారీ వ్యత్యాసాలను ఎదుర్కోవచ్చు. ప్రయాణికుడికి రానుపోను (రిటర్న్) ఛార్జీలు సుమారు Dh1,400 నుండి Dh9,200 కంటే ఎక్కువ వరకు ఉండవచ్చు. ఎమిరేట్స్, ఇండిగో మరియు స్పైస్‌జెట్ వంటి విమానయాన సంస్థలలో ఆగస్టు 1 మరియు 31 మధ్య ప్రయాణం కోసం అందుబాటులో ఉన్న టిక్కెట్ల ధరలను పరిశీలించగా.. ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. సెలవుల సీజన్ కారణంగా అధిక డిమాండ్ ఉన్నందున, కొన్ని మార్గాల్లో ధరలు అందుబాటులో ఉన్నప్పటికీ, మరికొన్ని మార్గాల్లో ధరలు భారీగా పెరిగాయి.
హైదరాబాద్ అత్యంత ఖరీదైన గమ్యస్థానంగా నిలిచింది. ఇక్కడ రానుపోను ఛార్జీలు ఒక్కో ప్రయాణికుడికి Dh9,250 వరకు చేరాయి. తర్వాతి స్థానాల్లో ఢిల్లీ (Dh9,090) మరియు కొచ్చి (Dh7,800) ఉన్నాయి. మరోవైపు, ముంబైకి ప్రయాణించే వారికి కొన్ని విమానయాన సంస్థలలో రానుపోను టిక్కెట్లు కేవలం Dh1,404కే లభించే అవకాశం ఉంది. అలాగే చెన్నైకి ఛార్జీలు Dh1,678 నుండి ప్రారంభమవుతున్నాయి. ఈ వ్యత్యాసం చాలా స్పష్టంగా ఉన్నాయి. హైదరాబాద్‌కు ప్రయాణించే నలుగురు సభ్యుల కుటుంబం కేవలం రానుపోను టిక్కెట్ల కోసమే దాదాపు Dh37,000 ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అదే తక్కువ ధర విమానయాన సంస్థలలో ముంబైకి ప్రయాణించే కుటుంబం Dh6,000 కంటే తక్కువ ఖర్చుతో ప్రయాణించవచ్చు.
స్కూల్ సెలవులు, సమ్మర్ ట్రావెల్ డిమాండ్ మరియు పరిమిత సీట్ల లభ్యత వంటి కారణాల వల్ల ఈ ధరల పెరుగుదల కనిపిస్తోందని వైజ్‌ఫాక్స్ టూరిజం సీనియర్ మేనేజర్ సుబైర్ తేకెపురత్‌వలప్పిల్ అన్నారు. ఆగస్టు మరియు జూన్ చివరి నాటికే అనేక విమానాల్లో టిక్కెట్లు అమ్ముడైపోయాయని, వేసవి సెలవుల్లో డిమాండ్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల దక్షిణ భారతదేశం అత్యంత ఖరీదైన ప్రాంతాలలో ఒకటిగా కొనసాగుతోందని పేర్కొన్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌కు విస్తృత ప్రాంతం నుండి ప్రయాణికులు వస్తుంటారని సుబైర్ వివరించారు.
ఈ సంవత్సరం ఢిల్లీ మార్గాల్లో అధిక ఛార్జీలకు ఉత్తర భారతదేశంలోని పండుగ ప్రయాణాలు కూడా ఒక కారణంగా నిలుస్తున్నాయని ఆయన తెలిపారు.విమాన ప్రయాణ తేదీలు దగ్గర పడుతున్న కొద్దీ సీట్లు నిండిపోవడాన్ని విమానయాన సంస్థలు గమనిస్తున్నందున ఛార్జీలు మరింత పెరిగే అవకాశం ఉందని ఐదాసాని తెలిపారు. వేసవిలో ప్రయాణ ప్రణాళికలు ఖరారు చేసుకున్న నివాసితులు వీలైనంత త్వరగా బుక్ చేసుకోవాలని ట్రావెల్ ఏజెంట్లు సూచిస్తున్నారు. సీట్ల లభ్యత కంటే డిమాండ్ ఎక్కువగా ఉన్నందున ఆగస్టులో ఛార్జీలు అధికంగానే ఉండే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్‌లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..







