సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- June 28, 2026
అబుదాబి: సౌదీ అరేబియాలోని రాస్ తనూరా ప్రాంతంలో సౌదీ అరామ్కోకు చెందిన హెలికాప్టర్ కూలి అందులో ప్రయాణిస్తున్న వారంతా మృతి చెందిన ఘటనపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ విషాద ఘటనలో సౌదీ అరేబియాకు తమ పూర్తి సంఘీభావాన్ని ప్రకటిస్తూ యూఏఈ సంతాపం తెలిపింది.
ఈ మేరకు యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ (MoFA) విడుదల చేసిన ప్రకటనలో, ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. అలాగే ఈ విషాద సమయంలో సౌదీ ప్రభుత్వం, ప్రజలకు యూఏఈ తన హృదయపూర్వక సంతాపాన్ని వ్యక్తం చేస్తోందని పేర్కొంది.
ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించిన యూఏఈ, మృతుల కుటుంబ సభ్యులకు ధైర్యం చేకూరాలని ఆకాంక్షించింది. ఈ క్లిష్ట సమయంలో సౌదీ అరేబియాతో తాము అండగా ఉంటామని యూఏఈ తన ప్రకటనలో స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







