సైనా నెహ్వాల్ ఘన విజయం

- August 11, 2016 , by Maagulf
సైనా నెహ్వాల్ ఘన విజయం

రియో ఒలింపిక్స్‌లో 6వ రోజున బ్యాట్మింటన్ క్రీడలో భారత విజయపరంపర కోనసాగింది. ఇండియన్ బ్యాట్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ ఘన విజయాన్ని నమోదు చేసింది. మహిళా బ్యాట్మింటన్ సింగిల్స్ విభాగంలో మొదటి మ్యాచ్‌లోనే అదరగొట్టింది. ప్రిలిమినరీస్‌ గ్రూప్ జిలో జరుగుతున్న మ్యాచ్‌లో బ్రెజిల్‌కు చెందిన తన ప్రత్యర్ధి లోహెన్ని విసెంటిపై 2-0 తేడాతో గెలుపొందింది. ఫస్ట్ సెట్ 21-17 తేడోతో కైవసం చేసుకున్న సైనా, రెండో సెట్‌లో కూడా 21-17 తేడాతో గెలుపొందింది. తన ప్రత్యర్ధి విసెంటి లోకల్ అమ్మాయి కావడంతో ఆమె గెలిచిన ప్రతి పాయింట్‌కు ప్రాంగణం హోరెత్తేలా అరిచారు అక్కడి ప్రేక్షకులు. అయినప్పటికీ మైండ్ డైవర్ట్ కాకుండా జాగ్రత్తపడుతూ మ్యాచ్ నెగ్గింది సైనా. తన తర్వాత గేమ్‌లో ఉక్రెయిన్‌కి చెందిన మరిజ ఉలిటినతో ఆగష్టు 14న తలపడనుంది సైనా నెహ్వాల్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com