కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- July 01, 2026
కువైట్: జూన్ 30న బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ ఒప్పందం గడువు ముగియడంతో.. జూలై 1 నుండి పాస్‌పోర్ట్, కాన్సులర్ మరియు వీసా సేవలు కేవలం అత్యవసర కేసులకు మాత్రమే పరిమితం చేయబడతాయని కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది.
కొత్త సేవా ప్రదాత అయిన డూ డిజిటల్.. జూలై 1 నుండి పాస్‌పోర్ట్ మరియు కాన్సులర్ సేవలను ప్రారంభించాల్సి ఉంది. అయితే, పరిపాలనా కారణాల వల్ల అత్యవసర సేవలు మాత్రమే అందించబడతాయని రాయబార కార్యాలయం ఒక అత్యవసర ప్రకటనను జారీ చేసింది. జూలై 2 నుండి సేవల కొనసాగింపు విషయాన్ని తరువాత ప్రకటించబబుతుందని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
ఇక అత్యవసర సేవల్లో తత్కాల్ పాస్‌పోర్ట్‌లు, ఎన్ఆర్ఐ సర్టిఫికెట్లు, గడువు ముగియనున్న సివిల్ ఐడీలు ఉన్న దరఖాస్తుదారుల కోసం స్వల్పకాలిక పాస్‌పోర్ట్‌లు, అత్యవసర సర్టిఫికెట్లు మరియు ఇ-వీసాలు ఉన్నాయి.
జూలై 1 నుండి తదుపరి ప్రకటన వచ్చే వరకు ఏ ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్ (ICAC) కూడా దరఖాస్తులను స్వీకరించదని రాయబార కార్యాలయం ప్రకటించింది. అత్యవసర సేవలు అవసరమైన దరఖాస్తుదారులు అవసరమైన సహాయక పత్రాలతో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 12:00 గంటల మధ్య రాయబార కార్యాలయం కాన్సులర్ విభాగాన్ని సంప్రదించాలని కోరారు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!







