ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!

- July 01, 2026 , by Maagulf
ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!

దోహా: ఈ వేసవిలో ఖతార్‌లోని ప్రజలకు 'ఎడ్యుకేషన్ సిటీ'లో స్ఫూర్తినిచ్చే అంశాలు ఎన్నో స్వాగతం పలుకుతున్నాయి. జూన్ నెలలో ప్రారంభమైన ఇది ఆగస్టు వరకు ఖతార్ ఫౌండేషన్ (QF) అనేక రకాల క్యాంపులు, వర్క్‌షాప్‌లు, కార్యకలాపాలను అందిస్తోంది. ఇవి వ్యక్తిగత వికాసానికి ప్రత్యేక అవకాశాలను కల్పిస్తాయి. ఆసక్తి గలవారు 'ఎడ్యుకేషన్ సిటీ' యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా కార్యక్రమాలను పరిశీలించి, నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

ఖతార్ ఫౌండేషన్‌లో లెర్నింగ్ మరియు వ్యక్తిగత వికాసం అనేది కేవలం తరగతి గదికే పరిమితం కాకుండా ఏడాది పొడవునా కొనసాగాలని తాము నమ్ముతామని QF స్పోర్ట్స్ ప్రోగ్రామింగ్ విభాగం అధిపతి హమద్ ఎస్. అల్-షైబా అన్నారు. వేసవి లో జరిగే ఈ కార్యకలాపాలు యువతలో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలను పెంపొందించే విభిన్న అవకాశాలను ఒకచోట చేర్చడంలో ఎడ్యుకేషన్ సిటీకి ఉన్న ప్రత్యేక సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తాయన్నారు.

ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, జిమ్, వాలీబాల్, స్క్వాష్ మరియు బాస్కెట్‌బాల్ వంటి సౌకర్యాలు వేసవి కాలమంతా QF ఇండోర్ వేదికలలో బుక్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయని తెలిపారు. అదే సమయంలో జిమ్నాస్టిక్స్ మరియు ఫుట్‌సల్ వంటి ప్రత్యేక క్రీడా తరగతులు కూడా అన్ని వయసుల వారికి అనువైన కార్యకలాపాలను అందిస్తాయని వెల్లడించారు. 

వేసవి కార్యక్రమాలలో భాగంగా QF ప్రీ-యూనివర్సిటీ ఎడ్యుకేషన్ (PUE) విభాగం ముఖాయమ్న ప్రోగ్రామ్ ను నిర్వహిస్తోంది. ఈ శిబిరంలో  క్రీడలు, కోడింగ్, వ్యాపారం, క్వాంటం కంప్యూటింగ్ మరియు నాయకత్వ అభివృద్ధి వంటి కోర్సులను అందిస్తున్నట్టు ప్రకటించారు.  

ఇదిలా ఉండగా, ఖతార్‌లోని QF భాగస్వామ్య విశ్వవిద్యాలయం వర్జీనియా కామన్వెల్త్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ ది ఆర్ట్స్‌లో 3D మోడలింగ్, 3D ప్రింటింగ్ మరియు డిజిటల్ భావనలను భౌతిక వస్తువులుగా మార్చే సృజనాత్మక తయారీ ప్రక్రియలను నేర్చుకోవచ్చని తెలిపారు. 

‘క్రియేటింగ్ పాత్‌వేస్ ప్రోగ్రామ్’ 7–12 ఏళ్ల బాలికల కోసం తమ శిక్షణను ప్రారంభిస్తోంది. రెండు వారాల పాటు జరిగే ఈ శిబిరంలో ట్రాక్ అండ్ ఫీల్డ్, వాలీబాల్, బాస్కెట్‌బాల్, టెన్నిస్, మరియు ఫెన్సింగ్ అనే ఐదు ఉన్నత స్థాయి క్రీడలతో పాటు స్వీమ్మింగ్, స్ట్రెచింగ్, మరియు పోషకాహార సెషన్‌లను అందిస్తుందన్నారు. ఈ కార్యకలాపాలన్నింటితోపాటు మరెన్నోంటిని ఎడ్యుకేషన్ సిటీ యాప్‌లో చూసి తెలుసుకోవచ్చని పిలుపునిచ్చారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com