బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్‌ల బహుమతి
- July 01, 2026
మస్కట్: ఒమాన్‌లో నివసిస్తున్న కేరళకు చెందిన ప్రవాస భారతీయుడు కమాలుద్దీన్ అన్వర్‌షా అబుదాబిలో నిర్వహించిన బిగ్ టికెట్ తాజా వారాంతపు ఈ-డ్రాలో 25,000 దిర్హామ్‌లు గెలుచుకున్నారు.
45 ఏళ్ల కమాలుద్దీన్ గత రెండు దశాబ్దాలుగా ఒమాన్‌లో నివసిస్తున్నారు. గత రెండేళ్లుగా బిగ్ టికెట్ లాటరీలో క్రమం తప్పకుండా పాల్గొంటున్న ఆయన, జూన్ నెల చివరి వారాంతపు డ్రాలో విజేతగా నిలిచారు.
ఈ బహుమతి ద్వారా తన పై ఉన్న ఆర్థిక బాధ్యతలను, ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న అప్పులను తీర్చుకోవడానికి ఉపయోగించనున్నట్లు కమాలుద్దీన్ తెలిపారు. అయితే ఈ విజయంతో ఆగిపోకుండా, భవిష్యత్తులో మరింత పెద్ద బహుమతిని గెలుచుకోవాలనే ఆశతో బిగ్ టికెట్ డ్రాల్లో పాల్గొనడం కొనసాగిస్తానని చెప్పారు.
ఇదిలా ఉండగా, బిగ్ టికెట్ జూలై నెల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారంలో భాగంగా ఆగస్టు 3న నిర్వహించనున్న మెగా డ్రాలో 2 కోట్ల దిర్హామ్‌ల (Dh20 million) గ్రాండ్ ప్రైజ్‌ను విజేతకు అందజేయనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







