పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- July 02, 2026
హైదరాబాద్: హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మరియు ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన పెండింగ్ అంశాల పై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం డీజీపీ సి.వి.ఆనంద్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా పోలీస్ స్టేషన్ జూరిస్డిక్షన్లను పునర్వ్యవస్థీకరించాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్, రెవెన్యూ, న్యాయస్థానాల పరిధులను సమన్వయం చేస్తూ కొత్త పోలీస్ స్టేషన్ సరిహద్దులను రూపొందించాలని సూచించారు.
అలాగే ఈ ప్రక్రియలో నగర దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళిక, పట్టణ విస్తరణ, జనాభా పెరుగుదల, భవిష్యత్ పరిపాలనా అవసరాలను దృష్టిలో ఉంచుకోవడంతో పాటు సంబంధిత వర్గాల అభిప్రాయాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.
హైదరాబాద్ నగరంలోని వివాదాస్పద ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్ పరిధుల ఖరారుకు సంబంధించి ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. ఆ ప్రాంతాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి తుదిరూపు దిద్దాలని అధికారులకు సూచించారు.
ఈ పునర్వ్యవస్థీకరణతో పోలీస్ శాఖ కార్యనిర్వహణ సామర్థ్యం మరింత మెరుగుపడటంతో పాటు, ప్రజలకు, ప్రభుత్వ శాఖలకు, న్యాయవ్యవస్థకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమర్థవంతమైన పరిపాలన అందించడమే లక్ష్యమని సమావేశంలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్
- దుబాయ్‌లో ‘బ్రిడ్జెస్ ఆఫ్ లవ్’ పుస్తక ఆవిష్కరణ.. మత సామరస్యానికి పిలుపు
- ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంఖ్య 73 శాతం తగ్గింది..!!
- ఖతార్‌లో జాతీయ ఫ్లూ టీకా క్యాంపెయిన్.. ఉచితంగా వ్యాక్సిన్..!!
- బహ్రెయిన్‌లో వెటర్నరీ నమూనాల ఎగుమతి సులభతరం..!!
- యూఏఈలో షాపింగ్ పై ఇంధన ధరల ప్రభావం..!!
- కువైట్‌లో 8 కార్మిక చట్ట ఉల్లంఘనలపై ఫిర్యాదు.. ఇక ఆన్లైన్లోనే..!!
- జెడ్డా ఎయిర్పోర్ట్ టెర్మినల్ 4లో పాస్‌పోర్ట్ కౌంటర్ల తనిఖీలు..!!
- దుబాయ్ రాయల్ ఫామిలీకు సిరిసిల్ల చేనేత కళాకారుడి అరుదైన కానుక
- ఖతార్‌లో ఇంపౌండ్ వాహనాల ఆన్లైన్ వేలం..!!







