బహ్రెయిన్‌లో టీం జనసేన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు
- August 23, 2026
మనామా: పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 71వ పుట్టినరోజు సందర్భంగా టీం జనసేన బహ్రెయిన్ ఆధ్వర్యంలో ప్రత్యేక రక్తదాన శిబిరం నిర్వహించారు.బహ్రెయిన్‌లోని సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ లో జరిగిన ఈ కార్యక్రమానికి మెగాస్టార్ అభిమానులు, మెగా ఫ్యామిలీ అభిమానులు, జనసేన మద్దతుదారులు, వీర మహిళలు, వివిధ భారతీయ సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
మెగాస్టార్ చిరంజీవి సుదీర్ఘకాలంగా కొనసాగిస్తున్న మానవతా సేవా స్ఫూర్తితో ఈ రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. స్వచ్ఛంద రక్తదానం ప్రాధాన్యతపై అవగాహన కల్పించడంతో పాటు సమాజ సేవకు ప్రోత్సాహం అందించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
100 మందికి పైగా రక్తదానం
ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా రక్తదాతలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని సేవా కార్యక్రమంతో జరుపుకోవడం తమకు ఎంతో ఆనందంగా ఉందని నిర్వాహకులు తెలిపారు.
చిరంజీవి తెలుగు సినీ పరిశ్రమలో నటన, నృత్యం ద్వారా విశేష గుర్తింపు పొందడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ తనదైన ముద్ర వేశారని వారు పేర్కొన్నారు. ఆయనకు పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు లభించాయని, ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో సత్కరించిందని గుర్తుచేశారు.
టీమ్ జనసేన సభ్యుల సమన్వయం
ఈ రక్తదాన శిబిరాన్ని టీం జనసేన బహ్రెయిన్ సభ్యులు డి.శ్రీనివాస్ రావు, హేమంత్, నాగేష్ జి.,ఎం.సతీష్ కుమార్, భాస్కర్ రాయుడు తదితరులు సమన్వయం చేశారు. టీమ్ సభ్యుల సమిష్టి కృషితో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
రక్తదాన శిబిరం ముగిసిన అనంతరం నిర్వాహకులు, రక్తదాతలు, వీర మహిళలు, అభిమానులు, ఇతర సభ్యులు కలిసి కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులోనూ సేవా, సామాజిక కార్యక్రమాలను కొనసాగించాలని ప్రతిజ్ఞ చేశారు.
రక్తదానం చేసిన ప్రతి ఒక్కరితో పాటు కార్యక్రమానికి సహకరించిన వాలంటీర్లు, అభిమానులు, మద్దతుదారులు, శ్రేయోభిలాషులకు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చిరంజీవి 71వ పుట్టినరోజు వేడుకలను రక్తదానంతో నిర్వహించడం ద్వారా మానవతా సేవకు మరింత ప్రాధాన్యత చేకూర్చామని పేర్కొన్నారు.


తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







