గచ్చిబౌలి విషాదం పై హైడ్రా సీరియస్..
- August 22, 2026
హైదరాబాద్: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి అంజయ్య నగర్‌లో చోటుచేసుకున్న భవన కూల్చివేత ఘటన నగరంలో కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో, హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెంటనే స్పందించి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిబంధనలను తుంగలో తొక్కి నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను ఎలాంటి వెనుకంజ లేకుండా నేలమట్టం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కేవలం యాభై గజాల స్థలంలో ఏడంతస్తుల నిర్మాణం చేపట్టడమే కాకుండా, అదనంగా పెంట్‌హౌస్ నిర్మించడం వల్లే ఈ పెను ప్రమాదం ముసరికొచ్చిందని ప్రాథమిక విచారణలో తేలింది.
నాసిరకం పనులు మరియు అధికారుల పరిశీలన
ఈ దుర్ఘటనకు కారణమైన బిల్డర్ సాజిద్ చేపట్టిన నిర్మాణాలన్నీ అత్యంత నాసిరకరంగా ఉంటాయని స్థానిక నివాసితులు ఆరోపిస్తున్నట్లు కమిషనర్ వెల్లడించారు. అంజయ్య నగర్ ప్రాంతంలో ఎలాంటి సెట్‌బ్యాక్‌లను పాటించకుండా ఇష్టానుసారంగా బహుళ అంతస్తులు నిర్మించిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. నాలా స్థలాలను ఆక్రమించి చేపట్టిన ఈ కట్టడాల్లో అధిక భాగం ప్రస్తుతం హాస్టళ్లుగా మార్చి నడుపుతున్నట్లు గుర్తించారు. ప్రమాదకర స్థితిలో ఉన్న ఇలాంటి భవనాల్లో ఉంటున్నవారందరూ వెంటనే ఖాళీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ప్రత్యేక డ్రైవ్ ద్వారా కూల్చివేతలు
ప్రమాదకర భవనాల భవితవ్యంపై దృష్టిసారించిన హైడ్రా యంత్రాంగం, త్వరలోనే ఈ ప్రాంతంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టనుంది. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన ప్రతి ఒక్క అక్రమ నిర్మాణాన్ని గుర్తించి నిర్దాక్షిణ్యంగా కూల్చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. నగరంలో భద్రతా ప్రమాణాలు పాటించని బిల్డర్లు మరియు యజమానులపై కఠిన చర్యలు ఉంటాయని ఈ ఘటన హెచ్చరికగా నిలిచింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







