ఇరాన్ దురాక్రమణ పై యూఎన్ఓలో బహ్రెయిన్ ఫైర్..!!

- July 03, 2026 , by Maagulf
ఇరాన్ దురాక్రమణ పై యూఎన్ఓలో బహ్రెయిన్ ఫైర్..!!

మనామా: ఇరాన్ పదే పదే దురాక్రమణకు పాల్పడుతుందని ఐక్యరాజ్యసమితి సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ అబ్దుల్లతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీ ఆరోపించారు. నిరంతరంగా ఇరాన్ క్షిపణులు మరియు డ్రోన్లతో ఇటీవల జరిపిన దాడులను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ దాడులు అధికంగా ఉన్న పౌర ప్రాంతాలను, కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నాయని వివరించారు. అమెరికా-ఇరాన్ మధ్య అవగాహన ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత కూడా దాడులు కొనసాగుతున్నాయని తెలియజేశారు.

బహ్రెయిన్ అభ్యర్థన మేరకు జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం నిర్వహించింది. ఇరాన్ చర్యలను ఖండిస్తూ మండలి తన వైఖరిని పునరుద్ఘాటించాలని, టెహ్రాన్‌ను తన దాడులను తక్షణమే నిలిపివేసేలా ఒత్తిడి చేయాలని బహ్రెయిన్ కోరింది.  ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 2817 (2026)ను పూర్తిగా పాటించాలని, అలాగే అంతర్జాతీయ చట్టానికి కట్టుబడి ఉండాలని, సమర్థవంతమైన పర్యవేక్షణ, జవాబుదారీ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కూడా డాక్టర్ అబ్దుల్లతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీ పిలుపునిచ్చారు.

అంతర్జాతీయ శాంతి, భద్రతను కాపాడాలనే బాధ్యతతోనే బహ్రెయిన్ ఈ అత్యవసర సమావేశాన్ని ప్రారంభించిందని అల్ జయానీ స్పష్టం చేశారు. బహ్రెయిన్‌లో అధిక జనసాంద్రత ఉందని, అరబ్ ప్రపంచంలో ఇది మొదటి స్థానంలో, ప్రపంచవ్యాప్తంగా మూడవ స్థానంలో ఉందని, ఇక్కడ పారిశ్రామిక సౌకర్యాలు, నివాస ప్రాంతాలు ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయని పేర్కొన్నారు. 

బహ్రెయిన్‌లో మొత్తం 808 దాడులు నమోదైనట్లు తెలిపారు. వీటిలో 203 బాలిస్టిక్ క్షిపణులు, 605 డ్రోన్ దాడులు ఉన్నాయని వివరించారు. మహిళలు, పిల్లలతో సహా పౌరులలో ముగ్గురు మరణించగా, 465 మంది గాయపడ్డారని విదేశాంగ మంత్రి తెలిపారు. పౌర జనాభాలో భీభత్సం సృష్టించే ఇరాన్ చర్యలను నేరంగా పరిగణించే అంతర్జాతీయ మానవతా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com