విష్ణు, మరో రెండు సినిమాలకు లైన్ లో..
- August 12, 2016
చాలా రోజుల తరువాత ఆడో రకం ఈడోరకం సినిమాతో సక్సెస్ కొట్టిన మంచు విష్ణు, అదే జోరులో వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఇప్పటికే కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో సరద అనే సినిమా చేస్తున్న విష్ణు, మరో రెండు సినిమాలకు లైన్ లో పెట్టాడు. అంతేకాదు ఆ రెండు సినిమాలకు టైటిల్స్ కూడా ప్రకటించేసి అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు విష్ణు.సరద సినిమా షూటింగ్ చివరి దశకు రావటంతో తను చేయబోయే నెక్ట్స్ సినిమా మీద క్లారిటీ ఇచ్చాడు.గీతాంజలి సినిమాతో ఆకట్టుకున్న రాజ్ కిరణ్ దర్శకత్వంలో ఓ యాక్షన్ కామెడీ సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమాను ఎంవివి సినిమా బ్యానర్ పై ఎంవివి సత్యనారాయణ నిర్మించనున్నాడు. ఈసినిమాకు లక్కున్నోడు అనే టైటిల్ ను ఎనౌన్స్ చేశారు. ఈ సినిమాతో పాటు మోహన్ బాబుతో కలిసి సేనపతి అనే సినిమాకు కూడా పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు విష్ణు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







