హిందీ లో పెళ్లిచూపులు రీమేక్..!
- August 12, 2016
టాలీవుడ్ నటులు విజయ్ దేవరకొండ, రీతూ వర్మలు ప్రధాన పాత్రల్లో నటించిన పెళ్లిచూపులు చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయబోతున్నారు. ఇందులో సల్మాన్ ఖాన్ నటించనున్నాడు. అంతే కాకుండా ఈ సినిమాలో సల్లూభాయ్ తన బావమరిది ఆయుష్ శర్మను బాలీవుడ్‌కు పరిచయం చేయబోతున్నాడు. ఈ విషయాన్ని పెళ్లి చూపులు నిర్మాత రాజ్ కందుకూరి మీడియా ద్వారా వెల్లడిస్తూ.. ''అవును. ఈ సినిమా రీమేక్‌ని సల్మాన్‌తో చేయబోతున్నాం. ఈ విషయం గురించి సల్మాన్‌తో మాట్లాడే వీలులేకపోవడంతో ఆయన బావ అతుల్ అగ్నిహోత్రితో చర్చించాం'' అన్నారు. రాజ్ కందుకూరితో పాటు తరుణ్ భాస్కర్ కూడా ఉన్నారు.తెలుగులో పెళ్లిచూపులు చిత్రాన్ని తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించారు కాబట్టి హిందీ వెర్షన్ కూడా ఆయనే దర్శకత్వం వహిస్తే బాగుంటుందని ఆయన్ని ఒప్పించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. సల్మాన్‌తో ఈ మీటింగ్‌ను ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఏర్పాటుచేశారు. ఆయనే పెళ్లిచూపులు దర్శకుడిని, నిర్మాతని భాయ్‌కు పరిచయం చేశారు. అయితే ఈ రీమేక్ హక్కుల కోసం చిత్రబృందం కోటి రూపాయలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయమై సల్మాన్ తరఫున విజయేంద్ర ప్రసాద్ చిత్రబృందంతో మాట్లాడతారట. దర్శక నిర్మాత కరణ్ జోహార్ కూడా తరుణ్ భాస్కర్, రాజ్ కందుకూరితో చర్చించనున్నారు. ఏ విషయం అన్నది తరుణ్, రాజ్‌లు వారంలోపు సల్మాన్‌తో మాట్లాడి డీల్ ఫైనలైజ్ చేస్తారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ పురస్కారం
- 40 మంది సభ్యులతో గవర్నర్‌ను కలవనున్న జగన్
- మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్-2025గా విద్యా సంపత్
- న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
- కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్‌లు ఇక టెక్ట్స్‌లో!
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్‌లో వాహనాలు స్వాధీనం..!!







