ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!

- July 04, 2026 , by Maagulf
ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!

కువైట్: ప్లాస్టిక్ కాలుష్యం ప్రపంచంలోని అత్యంత తీవ్రమైన పర్యావరణ సవాళ్లలో ఒకటిగా మారిందని, ఇది సముద్ర జీవావరణ వ్యవస్థలు, జీవవైవిధ్యం, ఆహార భద్రత మరియు మానవ ఆరోగ్యంపై సుదూర ప్రభావాలను చూపుతుందని కువైట్ పర్యావరణ పరిరక్షణ సంఘం (కేఈపీఎస్) హెచ్చరించింది.

ప్రతి సంవత్సరం జూలై 3న పాటించే అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం సందర్భంగా  కేఈపీఎస్ బోర్డు సభ్యుడు అహ్మద్ మురాద్ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ కాలుష్యం కేవలం సహజ ప్రకృతి దృశ్యాలను పాడుచేయడానికే పరిమితం కాకుండా, తీరప్రాంత ఆర్థిక వ్యవస్థలకు పెనుశాపంగా మారిందన్నారు. దీని కారణంగా ప్రతి సంవత్సరం బిలియన్ల డాలర్లు నష్టం కులుగుతుందని అన్నారు.

ప్రతి సంవత్సరం సుమారు 1.1 కోట్ల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాలు మరియు మహాసముద్రాలలోకి చేరుతున్నాయని, అలాగే సముద్ర పర్యావరణంలో ఇప్పటికే పేరుకుపోయిన మొత్తం ప్లాస్టిక్ 19 కోట్ల మెట్రిక్ టన్నులుగా ఇటీవలి శాస్త్రీయ అధ్యయనాలు తెలిపాయని మురాద్ పేర్కొన్నారు.

సముద్ర కాలుష్యంలో సుమారు 80 శాతం భూమిపైనే మొదలవుతుందని ఆయన అన్నారు. మిగిలిన 20 శాతం చేపలు పట్టడం మరియు నౌకాయానం వంటి సముద్ర కార్యకలాపాల నుండి వస్తుందని, కాలుష్యాన్ని తగ్గించడం అనేది రోజువారీ ప్రవర్తనలను మార్చుకోవడం మరియు భూమి ఆధారిత వ్యర్థాల నిర్వహణను మెరుగుపరచడంతోనే మొదలవుతుందని వివరించారు.

మైక్రోప్లాస్టిక్స్ సముద్ర జీవుల ద్వారా ఆహార గొలుసులోకి ప్రవేశించి, చివరికి మానవులను చేరుకుంటాయి. దీనివల్ల ఈ సమస్య పర్యావరణ మరియు ప్రజారోగ్యపరమైన ఆందోళనగా మారుతుందన్నారు. సముద్ర కాలుష్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 21 బిలియన్ డాలర్లకు పైగా ఆర్థిక నష్టాలు వాటిల్లుతున్నాయని, ప్రస్తుత కాలుష్య ధోరణులు ఇలాగే కొనసాగితే ఈ నష్టాలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడానికి నిరంతర ప్రజా అవగాహన ప్రచారాలు, తిరిగి ఉపయోగించగల క్లాత్ బ్యాగుల వంటి చవకైన మరియు ఆచరణాత్మక ప్రత్యామ్నాయాల లభ్యత, పర్యావరణ చట్టాల సమర్థవంతమైన అమలు, వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ వ్యవస్థలలో మెరుగుదలలు అవసరమని మురాద్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com