ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!

- July 04, 2026 , by Maagulf
ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!

యూఏఈ: యూఏఈ మొట్టమొదటి ప్రయాణీకుల రైలు ఘనంగా ప్రారంభం కావడంతో.. ప్రయాణించడానికి ప్రజలు ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు. ప్రారంభానికి ముందే 10,000కు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. ఎతిహాద్ రైల్ తన వెబ్‌సైట్‌లోని ప్యాసింజర్ చార్టర్ లో టికెట్ ధరల విధానాన్ని స్పష్టం చేసింది. ఈ విధానం ప్రకారం, పిల్లలు మరియు వృద్ధులు రాయితీ ధరలల్లోనే ప్రయాణించవచ్చు.

18 నుండి 59 సంవత్సరాల వయస్సు గల పెద్దలకు సాధారణ ధరలు వర్తిస్తాయి. ప్రస్తుతం, పెద్దల టికెట్లపై 50 శాతం ప్రారంభ రాయితీ లభిస్తోంది. 17 ఏళ్లలోపు పిల్లలకు, సాధారణ టికెట్ ధరపై 50 శాతం రాయితీ వర్తిస్తుంది. 14 ఏళ్లలోపు పిల్లలు తప్పనిసరిగా ఎవరైన పెద్దవారితో కలిసి ప్రయాణించాల్సి ఉంటుంది.

ఇక రెండు సంవత్సరాల లోపు వయస్సు గల చిన్నారులకు ప్రయాణం ఉచితం. ఒకవేళ  చిన్నారి కోసం ప్రత్యేక సీటును కోరుకుంటే, వారు 'చైల్డ్ టికెట్' (పిల్లల టికెట్)ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

60 ఏళ్లు పైబడిన వారు కూడా ఎతిహాద్ రైల్ లో రాయితీ ధరకే ప్రయాణించవచ్చు. వారు సాధారణ టికెట్ ధర కంటే 20 శాతం తక్కువకే టిక్కెట్ ను కొనుగోలు చేయవచ్చు. అయితే, వయస్సును నిర్ధారించడానికి అధికారులు సంబంధిత గుర్తింపు పత్రాన్ని (ID proof) అడగవచ్చు.

టికెట్ రద్దు మరియు రీఫండ్ విధానం

టికెట్ మార్పు లేదా రద్దు విషయంలో ప్రయాణీకులు ఏమి చేయవచ్చో కూడా ఈ విధాన పత్రం స్పష్టం చేస్తోంది. ప్రయాణీకులు తమ టికెట్‌ను రద్దు చేసుకోవాలనుకుంటే, ఎతిహాద్ రైల్ యాప్ లేదా అధికారిక వెబ్‌సైట్‌లోని 'మై బుకింగ్స్' విభాగం ద్వారా సులభంగా రద్దు చేసుకోవచ్చు. అలాగే, వారు కాంటాక్ట్ సెంటర్‌కు కాల్ చేయడం ద్వారా లేదా ఏదైనా ఎతిహాద్ రైల్ స్టేషన్‌లోని టికెట్ వెండింగ్ మెషీన్‌ను ఉపయోగించడం ద్వారా కూడా టికెట్‌ను రద్దు చేసుకోవచ్చు.

రద్దుపై రీఫండ్ విధానం

Saver: రీఫండ్ ఉండదు (Non-refundable).

Value: రీఫండ్ ఉండదు (Non-refundable).

ఫ్లెక్స్: బయలుదేరడానికి 24 గంటల కంటే ముందు చేసిన రద్దులకు పూర్తి వాపసు లభిస్తుంది. 24 గంటలలోపు చేసిన రద్దులకు 30 శాతం రద్దు రుసుము వర్తిస్తుంది. హాజరుకాని వారికి రీఫండ్ లభించదు.

టికెట్‌ను మార్చుకునే విధానం

ఒక ప్రయాణికుడు తమ టికెట్‌ను మార్చుకోవాలనుకుంటే.. వారు యాప్, వెబ్‌సైట్, వెండింగ్ మెషీన్‌ను ఉపయోగించవచ్చు లేదా దాని కోసం కాంటాక్ట్ సెంటర్‌ను సంప్రదించవచ్చు.

టికెట్ ఛార్జీతో సంబంధం లేకుండా, ప్రయాణికులు బయలుదేరే లేదా గమ్యస్థాన స్టేషన్‌లతో సహా ప్రయాణ మార్గాన్ని మార్చలేరు.

ఒక ప్రయాణికుడు తమ టికెట్‌లో చేసుకోగల మార్పులు.. వారు కొనుగోలు చేసిన టికెట్ క్లాస్‌పై ఆధారపడి ఉంటాయి.

సేవర్: ఎటువంటి మార్పులు అనుమతించబడవు.

వాల్యూ: బయలుదేరే నిర్ణీత సమయానికి 72 గంటల ముందు వరకు, తేదీ మరియు సమయాన్ని అపరిమితంగా ఉచితంగా మార్చుకోవడానికి అనుమతి ఉంది. ఆ తర్వాత చేసే మార్పులకు Dh20 రుసుముతో పాటు, ఛార్జీల వ్యత్యాసం కూడా వర్తిస్తుంది.

ఫ్లెక్స్: బయలుదేరే నిర్ణీత సమయానికి ముందు మరియు ఆ తర్వాత 30 నిమిషాల వరకు, తేదీ మరియు సమయాన్ని అపరిమితంగా మార్చుకోవడానికి అనుమతి ఉంది. ఏ రకమైన ఛార్జీకైనా రూట్ లో మార్పులు అనుమతించబడవు. మార్పు తర్వాత, కొత్త టిక్కెట్ జారీ చేయబడుతుంది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com