ఇద్దరు టెర్రరిస్టులు హతం

- July 05, 2026 , by Maagulf
ఇద్దరు టెర్రరిస్టులు హతం

జమ్మూకశ్మీర్ లోని లోయలో ఉగ్రవాదుల ఏరివేత లక్ష్యంగా భద్రతా దళాలు జరిపిన భారీ ఆపరేషన్‌లో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు హతమయ్యారు. షోపియాన్ జిల్లాలోని చాన్పొరా గ్రామంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో భారత సైన్యం, స్థానిక పోలీసులు సంయుక్తంగా నిన్న రాత్రి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ (గాలింపు చర్యలు) చేపట్టారు. భద్రతా దళాల రాకను గమనించిన ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడటంతో, అప్రమత్తమైన జవాన్లు ఎదురుకాల్పులు ప్రారంభించారు. హోరాహోరీగా సాగిన ఈ ఎన్‌కౌంటర్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘లష్కరే తోయిబా’ (LeT) కి చెందిన కీలక ఆపరేటివ్ జాకీర్ అహ్మద్ గనీతో పాటు, అతని ప్రధాన అనుచరుడు లతీఫ్ భట్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఆపరేషన్ విజయవంతం కావడం కశ్మీర్ లోయలో ఉగ్రవాద నెట్‌వర్క్‌కు పెద్ద దెబ్బగా భద్రతా వర్గాలు భావిస్తున్నాయి.

CCTV దృశ్యాల ఆధారంగా గుర్తింపు!

హతమైన ఉగ్రవాదుల్లో ఒకరైన జాకీర్ అహ్మద్ గనీపై గతంలో పలు కీలక ఉగ్రవాద కేసులు ఉన్నాయి. ముఖ్యంగా పర్యాటక ప్రాంతమైన పహాల్గమ్ పరిసరాల్లో జరిగిన ఘోర ఉగ్రదాడులతో పాటు, భద్రతా బలగాలే లక్ష్యంగా జరిగిన పలు దాడుల కేసుల్లో ఇతడు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. గత కొంతకాలంగా ఈ ఇద్దరు ఉగ్రవాదులు స్థానికంగా అలజడి సృష్టించేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. ఎన్‌కౌంటర్ జరగడానికి కొద్దిసేపటి ముందే వీరిద్దరూ ఆయుధాలతో సంచరిస్తున్న దృశ్యాలు ఆ ప్రాంతంలోని సీసీటీవీ (CCTV) కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ లూప్‌హోల్ ఆధారంగానే భద్రతా దళాలు వీరి కదలికలను నిశితంగా గమనించి, పక్కా వ్యూహంతో ఉచ్చు బిగించి మట్టుబెట్టాయి.ఎన్‌కౌంటర్ అనంతరం ఘటనా స్థలం నుండి భారీగా ఆయుధాలు, మందుగుండు సాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఆర్మీ అధికారులు ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com