సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- July 06, 2026
రియాద్: అక్రమ వ్యాపార కార్యకలాపాలు, కమర్షియల్ కన్సీల్మెంట్ (వ్యాపారాన్ని ఇతరుల పేరుతో అక్రమంగా నిర్వహించడం)పై సౌదీ అరేబియా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలో జాతీయ కమర్షియల్ కన్సీల్మెంట్ నిరోధక కార్యక్రమం (National Program to Combat Commercial Concealment) ఆధ్వర్యంలో జూన్ నెలలో 4,500కు పైగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 104 అనుమానాస్పద ఉల్లంఘనలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.
కాగా, తనిఖీల సందర్భంగా గుర్తించిన కేసులను దర్యాప్తు కోసం సంబంధిత అధికారులకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. ఉల్లంఘనలు రుజువైతే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో ప్రధానంగా వాణిజ్య సంస్థలు చట్టాలను పాటిస్తున్నాయా లేదా అనే అంశాన్ని పరిశీలించారు. భూ రవాణా సేవలు, నివాసేతర భవనాల నిర్మాణం (పాఠశాలలు, ఆస్పత్రులు, హోటళ్లు), గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల రిటైల్ విక్రయాలు, బంగారం, విలువైన లోహాలు, రత్నాల వ్యాపారం, అలాగే వివిధ వస్తువులను నిల్వ చేసే గిడ్డంగులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు.
సౌదీ యాంటీ కమర్షియల్ కన్సీల్మెంట్ చట్టం ప్రకారం నేరం రుజువైన వారికి గరిష్ఠంగా ఐదేళ్ల జైలు శిక్షతో పాటు 50 లక్షల సౌదీ రియాల్స్ (SR5 మిలియన్) వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. వీటితోపాటు అక్రమంగా సంపాదించిన ఆస్తులను స్వాధీనం చేసుకోవడం, వ్యాపార సంస్థలను మూసివేయడం, వాణిజ్య రిజిస్ట్రేషన్ను రద్దు చేయడం, భవిష్యత్తులో వ్యాపార కార్యకలాపాలపై నిషేధం విధించడం వంటి చర్యలు కూడా తీసుకుంటారు. ఇక విదేశీ నిందితులను దేశం నుంచి బహిష్కరించడంతో పాటు, భవిష్యత్తులో సౌదీలో పనిచేసే అవకాశాన్ని శాశ్వతంగా రద్దు చేసే నిబంధన కూడా చట్టంలో ఉందని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







