ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- July 06, 2026
మనామా: ప్రత్యేక అవసరాలున్న (People of Determination) వ్యక్తుల నైపుణ్యాలను పెంపొందించి, సమాజంలో వారి భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి బహ్రెయిన్ సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ వార్షిక వేసవి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. పాఠశాలల వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా రూపొందించిన ఈ కార్యక్రమాన్ని ఎనిమిది సామాజిక సేవా సంస్థల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నారు. ప్రత్యేక అవసరాలున్న వ్యక్తులకు సమాన అవకాశాలు కల్పించడం, వారి ప్రతిభను వెలికితీయడం, సమాజంలో స్వతంత్రంగా ముందుకు సాగేలా ప్రోత్సహించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సోషల్ డెవలప్ మెంట్ మినిస్టర్ ఒసామా బిన్ సలేహ్ అల్ అలావి తెలిపారు.
ఈ సందర్భంగా ప్రత్యేక అవసరాలున్న వ్యక్తులు, వారి కుటుంబాలకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరేలా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు రూపొందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రత్యేక అవసరాలున్న వారి విద్య, నైపుణ్యాభివృద్ధి, సామాజిక సమగ్రతకు ప్రాధాన్యం ఇస్తూ బహ్రెయిన్ ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో ఈ కార్యక్రమం మరో ముఖ్యమైన అడుగుగా నిలుస్తుందని తెలిపారు.
ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనే వారికి వారి సామర్థ్యాలు, ఆసక్తులకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ, వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు, సామాజిక చైతన్య కార్యకలాపాలు నిర్వహించనున్నారు. దీంతో వారు కొత్త నైపుణ్యాలను అలవర్చుకోవడంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునే అవకాశం లభించనుంది. ఈ కార్యక్రమాన్ని బహ్రెయిన్ సొసైటీ ఫర్ పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్ ఆఫ్ ది డిసేబుల్డ్, ఫ్రెండ్‌షిప్ సొసైటీ ఫర్ ది బ్లైండ్, బహ్రెయిన్ సొసైటీ ఫర్ చైల్డ్ డెవలప్‌మెంట్, బహ్రెయిన్ డెఫ్ సొసైటీ, బహ్రెయిన్ ఆటిజం సొసైటీ, బహ్రెయిన్ సొసైటీ ఫర్ చిల్డ్రన్ విత్ బిహేవియరల్ అండ్ కమ్యూనికేషన్ డిఫికల్టీస్, చైల్డ్ అండ్ మదర్ వెల్ఫేర్ సొసైటీ, బహ్రెయిన్ మోటివేటర్స్ సొసైటీ ఫర్ పీపుల్ విత్ డిసెబిలిటీస్ సంస్థలు సంయుక్తంగా అమలు చేస్తున్నాయి.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







