ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- July 06, 2026
దోహా: ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన పెంపు, జాతీయ సామర్థ్యాల అభివృద్ధి లక్ష్యంగా జాతీయ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ (NCSA), beIN మీడియా గ్రూప్ మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. ఈ ఒప్పందంపై ఎన్సీఎస్ఏ తరఫున సైబర్ సెక్యూరిటీ పాలసీస్ అండ్ స్ట్రాటజీస్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ దలాల్ అల్ అకీది, beIN మీడియా గ్రూప్ తరఫున మిడిలీస్టు–నార్త్ ఆఫ్రికా మానవ వనరుల డైరెక్టర్ హమద్ అల్ షేక్ సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం ద్వారా సైబర్ భద్రత, డిజిటల్ భద్రతకు సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ట్రైనింగ్ సెషన్లను సంయుక్తంగా నిర్వహించనున్నారు. beIN ఉద్యోగులకు ఎన్సీఎస్ఏ నిర్వహించే గ్రాడ్యుయేట్ బూట్క్యాంప్, ప్రొఫెషనల్స్, మేనేజర్స్, లీడర్స్ ప్రోగ్రామ్లతో పాటు సైబర్ భద్రత వర్క్షాప్లు, అవగాహన సదస్సుల్లో పాల్గొనే అవకాశం కల్పించనున్నారు.
ఈ సందర్భంగా దలాల్ అల్ అకీది మాట్లాడుతూ.. డిజిటల్ భద్రతపై సమాజంలో అవగాహన పెంపొందించేందుకు, సురక్షిత డిజిటల్ వాతావరణ నిర్మాణానికి ఈ ఒప్పందం దోహదపడుతుందని తెలిపారు. వేగంగా పెరుగుతున్న సైబర్ ముప్పుల నేపథ్యంలో అవగాహన, శిక్షణే తొలి రక్షణ కవచమని హమద్ అల్ షేక్ అన్నారు. ఆధునిక టెక్నాలజీలతోపాటు బలమైన భద్రతా సంస్కృతిని పెంపొందించడం కూడా అంతే కీలకమని పేర్కొన్నారు.
ఎంఓయూ ప్రకారం, ఎన్సీఎస్ఏ నిర్వహించే జాతీయ శిక్షణా కార్యక్రమాలు, అవగాహన ప్రచారాలను beIN మీడియా తన డిజిటల్ వేదికలు, టెలివిజన్ ఛానెల్ల ద్వారా ప్రచారం చేయనుంది. అలాగే, చిన్నారుల్లో సైబర్ భద్రత, డిజిటల్ భద్రతపై అవగాహన పెంచే ప్రత్యేక కార్యక్రమాలు, కంటెంట్ రూపొందించే అవకాశాలను కూడా ఇరు సంస్థలు పరిశీలించనున్నాయి.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







