మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- July 07, 2026
మస్కట్: ఒమాన్‌లోని దక్షిణ అల్ షర్కియా గవర్నరేట్ పరిధిలోని మసీర్హా పోర్టు వద్ద సోమవారం జరిగిన అగ్నిప్రమాదాన్ని రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమాన్ (RAFO) అగ్నిమాపక సిబ్బంది సకాలంలో అదుపులోకి తీసుకువచ్చారు. అధికారుల వివరాల ప్రకారం, మసీర్హా పోర్టులోని పాత చేపల వేట పడవల శిథిలాల్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే మసీర్హా ఎయిర్ బేస్ కు చెందిన అగ్నిమాపక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని వేగంగా సహాయక చర్యలు చేపట్టాయి.
ఫైర్ ఫైటర్స్ సకాలంలో స్పందించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారని RAFO తెలిపింది. ఈ దుర్ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా ఎవరూ గాయపడలేదని వెల్లడించింది. ప్రభుత్వ సంస్థలతో సమన్వయంగా పనిచేస్తూ పౌరులు, ప్రవాసులు, ప్రజా ఆస్తుల భద్రతను కాపాడేందుకు ఒమాన్ సాయుధ దళాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయని పేర్కొన్నది.
తాజా వార్తలు
- ఒమన్‌లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక
- సౌదీలో ఇంటి వద్ద వైద్య సేవలకూ ఆరోగ్య బీమా వర్తింపు..!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. 60 రోజుల పాటు డెలివరీ వాహనాలు సీజ్..!
- వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండిని.. ప్రజలకు అష్ఘల్ సూచన..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!







