మహిళ దుస్తులు ధరించి తిరుగుతున్న ఇద్దరు వ్యక్తుల పట్టివేత
- August 12, 2016
జెడ: బురైదః లోని ఒక షాపింగ్ మాల్ లో బురఖా ధరించి మహిళల వేషంలో సంచరిస్తున్న బుధవారం సాయంత్రం ఇద్దరు యువకులని పోలీసులు అరెస్టు చేశారు.
తమ దుకాణంలో ఇద్దరు అనుమానిత వ్యక్తులు ఆడవారి వేషంలో వయ్యారాలు పోతూ, కొనుగోలు చేసేవారి మాదిరిగా హడావిడి చేస్తున్నారని పోలీసులకు దుకాణ యజమాని సమాచారం ఇచ్చారు. ఆడ వేషంలో ఉన్న ఈ ఇద్దరు యువకులు చక్కని మేకప్ తో, ఆడవారి అలంకరణతో వారిని ఎవరూ గుర్తించకుండా బురఖా చాటున తమ తమ మొఖాలను దాచుకొని తమ షాప్ లో తిరుగుతున్నారని పోలీసులకు దుకాణ నిర్వాహకులు తెలిపారు. వారు తమ షాపింగ్ ముగించుకొని యొక్క మసీదు సెంటర్ కు రాగానే అల్ ఖ్అస్సిమ్ పోలీసులు వీరిని అరెస్టు చేశారు.ఈ ఇరువురు పురుషులు సౌదీ జాతీయులని.. వారి వయస్సు 20 ఏళ్ళ లోపు ఉంటుందని పోలీసులు చెప్పారు. ఆ ఇద్దరు నేర పరిశోధన మరియు ప్రాసిక్యూషన్ బ్యూరో అధికారులకు పోలీసులు అప్పగించారు .
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







