ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారిని పరామర్శించిన రామ్
- August 12, 2016
విశాఖలో ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న ఐదేళ్ల చిన్నారి కుందన పూర్ణ చంద్రికను సినీనటుడు రామ్ పరామర్శించారు. ఎంవీపీ కాలనీ సెక్టార్-3లోని కుందన ఇంటికి వచ్చి చిన్నారితో కాసేపు గడిపారు. కుందన త్వరగా కోలుకొని, సంతోషంగా తిరగాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. రామ్ అంటే కుందనకు ఎంతో అభిమానమని.. రామ్‌ను చూడాలన్న ఆమె కోరిక నెరవేరడంతో ఎంతో సంతోషంగా ఉందని కుందన తల్లిదండ్రులు తెలిపారు.
కుందన పుట్టినప్పట్నుంచి నడుము కింది భాగం పూర్తిగా చచ్చుబడిపోయింది. కాళ్లు కదపలేని పరిస్థితులో ఉన్న ఆమెను తల్లిదండ్రులు జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు. 'ఈనాడు'లో ప్రచురితమైన కథనంతోనే తన అభిమాని పూర్ణ చంద్రిక కోరిక తెలుసుకోగల్గానని ఈ సందర్భంగా రామ్ అన్నారు.
సుమారు 15 నిమిషాల పాటు చిన్నారితో గడిపిన రామ్ శనివారం భోజనానికి రావాలని కుందన కుటుంబ సభ్యులను ఆహ్వానించారు. ఆయన వెంట బీజేవైఎం రాష్ట్ర ప్రతినిధి దామోదర యాదవ్, హైపర్ చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నారు.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







