కొత్త సినిమా ‘డ్యూ డేట్’ ఓపెనింగ్..
- July 08, 2026
లోమేష్ పూడిపెద్ది, జయశ్రీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం డ్యూ డేట్. ఆనంద్.కె దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వర్షిష్ స్టూడియోస్ పతాకంపై ఏలూరు శ్రీను, పవన్ తరిగోపు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లో ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్న ప్రణీత పట్నాయక్, విజాక్షనిలపై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు మారుతి క్లాప్ నివ్వగా, నిర్మాత బన్నీవాస్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఎస్‌కేఎన్, ధీరజ్ మొగిలినేని, వంశీ నందిపాటిలు చిత్ర దర్శకుడికి స్క్రీప్ట్‌ను అందజేశారు. ఈ ప్రారంభోత్సవ వేడుకకు.. దర్శకుడు విజయ్ కనకమేడల, విఐ ఆనంద్‌లతో పాటు పలువురు దర్శకులు, నిర్మాతలు పాల్గొన్నారు.
ఈ చిత్రం ఎంతో ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా ఉంటుందని, టైటిల్ దగ్గర నుంచి సినిమాలోని ప్రతి అంశం ప్రేక్షకులకు కొత్తదనంతో పాటు పూర్తి సంతృప్తిని కలిగించే కథ, కథనాలు ఉంటాయని నిర్మాతలు తెలిపారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని చెప్పారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







