భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- July 08, 2026
పశ్చిమాసియాలో అమెరికా (US), ఇరాన్ దేశాల మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో భారతదేశానికి కొత్త కష్టాలు మొదలయ్యాయి. అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిలోని ఒమన్ కారిడార్ మార్గంలో ప్రయాణిస్తూ, భారత్‌కు వస్తున్న ఒక క్రూడాయిల్ (కడి చమురు) నౌకను ఇరాన్‌కు చెందిన శక్తివంతమైన ‘ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్’ (IRGC) బలగాలు అడ్డుకుని వెనక్కి పంపించివేశాయి. అమెరికా నిర్దేశించిన లేదా సూచించిన సముద్ర కారిడార్ల గుండా ప్రయాణించడానికి వీల్లేదని, తాము నిర్దేశించిన మార్గాల్లోనే నౌకలు వెళ్లాలని ఇరాన్ గట్టిగా హెచ్చరించింది. ఈ పరిణామంతో ప్రపంచంలోనే అతిపెద్ద చమురు సరఫరా మార్గంలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పీక్ స్టేజ్‌కు చేరాయి.
హార్ముజ్ జలసంధి పై ఆధిపత్య పోరు..భారత్‌కు పెరగనున్న చమురు తలనొప్పి!
వ్యూహాత్మక ప్రాధాన్యత ఉన్న హార్ముజ్ జలసంధిపై పట్టు సాధించేందుకు అమెరికా, ఇరాన్ దేశాలు మరోసారి ‘ఢీ అంటే ఢీ’ అనేలా తలపడుతున్నాయి. ఈ రెండు అగ్ర దేశాల మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరు ఇప్పుడు నేరుగా భారత ఇంధన భద్రతపై ప్రభావం చూపేలా కనిపిస్తోంది. భారతదేశం తన అవసరాలకు సరిపడా ముడి చమురును అత్యధికంగా గల్ఫ్ దేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది, వీటన్నింటికీ హార్ముజ్ జలసంధే ప్రధాన మార్గం. ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో చమురు రవాణా ఆలస్యం కావడం లేదా ప్రత్యామ్నాయ మార్గాల వల్ల రవాణా ఖర్చులు పెరిగి, భారత్‌లో ఇంధన ధరలపై ప్రభావం పడే ప్రమాదం ఉంది. ఈ తాజా సంక్షోభం భారత దౌత్య, ఆర్థిక వర్గాలకు పెద్ద తలనొప్పిగా మారింది.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







