బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- July 08, 2026
రియాద్: బహ్రెయిన్ , కువైట్ దేశాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ జరిపిన దాడులను గల్ఫ్ సహకార మండలి (జీసీసీ) ప్రధాన కార్యదర్శి జాసెమ్ మొహమ్మద్ అల్‌బుదైవీ తీవ్రంగా ఖండించారు. ఈ దాడులు ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిలో శాంతి, భద్రత, సంక్షోభ పరిష్కారానికి జరుగుతున్న ప్రయత్నాలను బలహీనపరిచే ఇరాన్ వైఖరికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
అల్‌బుదైవీ మాట్లాడుతూ, బహ్రెయిన్, కువైట్‌లపై జరిగిన ఈ దాడులు రెండు దేశాల సార్వభౌమాధికారంపై ప్రత్యక్ష దాడిగా, అంతర్జాతీయ చట్టాలు మరియు ఐక్యరాజ్యసమితి (యూఎన్) చార్టర్‌కు విరుద్ధమైన చర్యగా అభివర్ణించారు. అలాగే ఈ దాడులు ఆ దేశాల భద్రత, స్థిరత్వంతో పాటు అక్కడ నివసిస్తున్న పౌరులు, ప్రవాసుల ప్రాణ భద్రతకు కూడా తీవ్రమైన ముప్పుగా నిలుస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బహ్రెయిన్, కువైట్ దేశాలకు జీసీసీ సంపూర్ణ సంఘీభావం ప్రకటిస్తున్నట్లు అల్‌బుదైవీ తెలిపారు. తమ భద్రత, స్థిరత్వాన్ని కాపాడేందుకు, పౌరులు మరియు నివాసితుల రక్షణ కోసం ఆ రెండు దేశాలు తీసుకునే అన్ని చర్యలకు గల్ఫ్ సహకార మండలి పూర్తి మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







