'మిస్టర్ మిడిల్ క్లాస్' జూలై 17న గ్రాండ్ గా రిలీజ్
- July 09, 2026
శ్రీకాంత్, లయ హీరో హీరోయిన్స్ గా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ మిస్టర్ మిడిల్ క్లాస్. జీకే & సిఎన్ నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. జూలై 17న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రానుంది. రిలీజ్ డేట్ పోస్టర్ లో శ్రీకాంత్ వేంకటేశ్వర స్వామీ గెటప్ లో కనిపించడం అందరినీ ఆకట్టుకుంది.
మిస్టర్ మిడిల్ క్లాస్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే కథ .అందరూ కలసి ఎంజాయ్ చేసే ఫ్యామిలీ ఎంటర్టైనర్.
ఈ చిత్రంలో సునీల్, రఘుబాబు, అలీ, వెన్నెల కిశోర్, పృథ్వీ, బాబూ మోహన్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో అలరించబోతున్నారు.
ఈ చిత్రానికి సాయి కార్తీక్ మ్యూజిక్, 'గరుడవేగ' అంజి సినిమాటోగ్రాఫర్, డైమండ్ రత్నబాబు డైలాగ్స్ అందిస్తున్నారు.
నటీనటులు: శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, లయ, సునీల్, రఘుబాబు, అలీ, వెన్నెల కిశోర్, పృథ్వీ, బాబూ మోహన్, ప్రభాస్ శ్రీను, చిత్రం శ్రీను, మురళీ గౌడ్, ధనరాజ్, మానిక్ రెడ్డి, చిట్టి, అశోక్ కుమార్, రజిత, అపూర్వ, భూపాల్, కరుణ, మాస్టర్ కార్తికేయ, సోనియా, బేబీ చైత్ర
కథ - స్క్రీన్‌ప్లే - దర్శకత్వం: జి. నాగేశ్వర్ రెడ్డి
నిర్మాతలు: జీకే & సిఎన్
సంగీతం: సాయి కార్తీక్
సినిమాటోగ్రాఫర్: 'గరుడవేగ' అంజి
డైలాగ్స్: డైమండ్ రత్నబాబు, శ్రావణ్
ఎడిటర్: చోటా కె ప్రసాద్
ఆర్ట్ డైరెక్టర్: చిన్న
ఫైట్ మాస్టర్స్: రామకృష్ణ, రామదాసు, శ్రీకాంత్ శశి
లిరిక్స్: శివుని చంద్ర శేఖర్ రెడ్డి
పీఆర్వో: వంశీ శేఖర్
పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







