ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌లో షాకింగ్ ఘటన..
- July 09, 2026
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఫౌజీ’ షూటింగ్ సందర్భంగా అనూహ్య ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతోంది. కాగా.. ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొన్న ప్రముఖ నటుడు రాజేష్ శర్మ విషపురుగు కాటుకు గురై తీవ్ర అస్వస్థతకు లోనయ్యారని సమాచారం.
షూటింగ్ ముగిసిన తరువాత రాజేష్ శర్మ సెట్‌లోని కొందరు టెక్నీషియన్లతో మాట్లాడుతుండగా ఒక విష పురుగు ఆయన కుడికాలి పాదంపై కుట్టింది. ఆ సమయంలో ఆయన అది ఓ సాధారమైన పురుగే అనుకుని పెద్దగా పట్టించుకోలేదు. అయితే కొన్ని గంటల వ్యవధిలోనే కుడికాలిలో తీవ్రమైన నొప్పి, శరీరమంతా నొప్పులు, అధిక జ్వరం వంటి లక్షణాలు కనిపించాయి. మెరుగైన చికిత్స కోసం ఆయన స్వస్థలమైన కోల్‌కతాకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
హైదరాబాద్ నుంచి కోల్‌కతాకు విమానంలో ప్రయాణిస్తున్న సమయంలోనే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించినట్లు సమాచారం. రక్తంలో చక్కెర స్థాయులు పెరగడంతో పాటు శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందులు తలెత్తినట్లు తెలుస్తోంది. విమానం కోల్‌కతా చేరుకున్న వెంటనే రాజేష్ శర్మను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వైద్యుల ప్రాథమిక పరీక్షల్లో విషపురుగు కాటు కారణంగా పాదం నుంచి మోకాలి వరకు ఇన్‌ఫెక్షన్ వేగంగా వ్యాపించినట్లు గుర్తించినట్లు సమాచారం. జ్వరం తగ్గకపోవడం, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తడంతో ఆయన్ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలిసిన అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
కాగా.. దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక అప్‌డేట్ రావాల్సి ఉంది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







