రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్‌టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- July 08, 2026
విజయవాడ: డా.ఎన్‌టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఉపకులపతి డా.పులాల చంద్రశేఖర్ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను బుధవారం రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిసింది.
ఈ ప్రతినిధి బృందంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, డైరెక్టర్ (రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్), డైరెక్టర్ ఆఫ్ పబ్లికేషన్స్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఇటీవల విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అధ్యక్షతన విజయవంతంగా నిర్వహించిన డా.ఎన్‌టీఆర్ యూనివర్సిటీ 29వ, 30వ స్నాతకోత్సవాల విశిష్ట ఘట్టాలను ప్రతిబింబించే స్మారక ఫోటో ఆల్బమ్‌ను ఉపకులపతి డా. పులాల చంద్రశేఖర్ గవర్నర్‌కు అందజేశారు.
స్నాతకోత్సవాలను విజయవంతంగా నిర్వహించడంలో గవర్నర్ అందించిన మార్గదర్శకత్వం, సహకారం, ప్రోత్సాహానికి విశ్వవిద్యాలయం తరఫున ఉపకులపతి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ, డా. ఎన్‌టీఆర్ యూనివర్సిటీ వైద్య విద్య, పరిశోధన, ఆరోగ్య శాస్త్రాల అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు. భవిష్యత్తులోనూ ఇదే నిబద్ధతతో వైద్య విద్యా రంగానికి, ప్రజారోగ్య సేవలకు విశ్వవిద్యాలయం మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఆత్మీయ వాతావరణంలో జరిగిన ఈ భేటీలో విశ్వవిద్యాలయం చేపడుతున్న విద్యా, పరిశోధన కార్యక్రమాలపై కూడా చర్చ జరిగినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







