బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- July 09, 2026
మనామా: హింస, మాదకద్రవ్యాల వ్యసన నివారణ కోసం బహ్రెయిన్‌లో అమలు చేస్తున్న 'మాన్' (Maaan) కార్యక్రమానికి ప్రతిష్ఠాత్మక అరబ్ ఇంటెలిజెన్స్ అండ్ క్రియేటివిటీ అవార్డుల్లో రెండు విభాగాల్లో అవార్డులు లభించాయి.
యువతలో హింస, వ్యసనాలను నివారించేందుకు రూపొందించిన విద్యా పాఠ్యాంశానికి విద్యా, అకాడమిక్ రంగం విభాగంలో అవార్డు దక్కగా, మాన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ అభివృద్ధి చేసిన 'ఈస్ట్' (EAST) వ్యూహాత్మక ప్రణాళిక వ్యవస్థకు అప్లైడ్ పర్సనల్ ఇన్నోవేషన్ విభాగంలో మరో అవార్డు లభించింది.
ఈ రెండు అవార్డులను బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అండర్‌సెక్రటరీ, మాన్ కమిటీ చైర్మన్ షేక్ హిషామ్ బిన్ అబ్దుల్‌రహ్మాన్ అల్ ఖలీఫా అందుకున్నారు. ప్రాంతీయ స్థాయిలో నివారణ చర్యలు, వినూత్న ఆవిష్కరణలు, పరిశోధన రంగాల్లో 'మాన్' కార్యక్రమం పెరుగుతున్న ప్రభావానికి ఈ అవార్డులు గుర్తింపుగా నిలిచాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







