చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- July 09, 2026
దోహా: చైనా, మలేషియా నుంచి దిగుమతి అవుతున్న ఎలక్ట్రిక్ బ్యాటరీలపై ఖతార్ ప్రభుత్వం ఫైనల్ యాంటీ-డంపింగ్ సుంకాలను విధించింది. ఈ మేరకు ఖతార్ వాణిజ్య, పరిశ్రమ మంత్రిత్వ శాఖ 2026 సంవత్సరానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం.. చైనా నుంచి దిగుమతి అయ్యే ఎలక్ట్రిక్ అక్యుములేటర్లపై 25.8 శాతం నుంచి 74 శాతం వరకు, మలేషియా నుంచి దిగుమతి అయ్యే వాటిపై 43.2 శాతం నుంచి 77 శాతం వరకు యాంటీ-డంపింగ్ సుంకాలు అమలులో ఉంటాయి. ఆయా ఉత్పత్తిదారులు, ఎగుమతిదారులకు నిర్ధారించిన డంపింగ్ మార్జిన్‌ను బట్టి సుంకాల శాతం నిర్ణయించబడుతుంది.
దేశీయ పరిశ్రమలను రక్షించడం, డంపింగ్‌ను అరికట్టడం, ఖతార్‌లో తయారయ్యే ఉత్పత్తుల పోటీతత్వాన్ని పెంచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. గల్ఫ్ సహకార మండలి (GCC) పారిశ్రామిక సహకార కమిటీ ఆమోదించిన తుది యాంటీ-డంపింగ్ చర్యల్లో భాగంగానే ఈ సుంకాలను అమలు చేస్తున్నట్లు పేర్కొంది.
జీసీసీ సమగ్ర కస్టమ్స్ టారిఫ్‌లోని హెడ్డింగ్ నంబర్ 8507, హెచ్‌ఎస్ కోడ్ 85071000 కింద వర్గీకరించిన ఎలక్ట్రిక్ అక్యుములేటర్ల దిగుమతులకు ఈ నిర్ణయం వర్తించనుందని వాణిజ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







