దోహా ఇండస్ట్రియల్ ఏరియాలో గోదాంలో అగ్నిప్రమాదం..!!
- July 12, 2026
దోహా: దోహాలోని ఇండస్ట్రియల్ ఏరియా*లో ఉన్న ఓ గోదాం(వేర్ హౌజ్)లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఘటనపై వెంటనే స్పందించిన సివిల్ డిఫెన్స్ బృందాలు మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి.
ఈ మేరకు ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of Interior) తన అధికారిక సోషల్ మీడియా వేదికల ద్వారా ఒక ప్రకటన విడుదల చేసింది. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని వేగంగా సహాయక చర్యలు చేపట్టారని, మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చినట్లు తెలిపింది.
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదని అధికారులు స్పష్టం చేశారు. అయితే, అగ్నిప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







