కువైట్లో జూలై 16 నుంచి పెరగనున్న ఎండల తీవ్రత..!!
- July 12, 2026
కువైట్ సిటీ: కువైట్లో వేసవి కాలం జూలై 16తో మధ్య దశకు చేరుకుంటుందని అల్-ఉజైరి సైంటిఫిక్ సెంటర్ ప్రకటించింది. ఈ తేదీ నుంచి 'సెకండ్ జెమినీ' పేరుతో పిలిచే 13 రోజుల ప్రత్యేక కాలం ప్రారంభమవుతుందని, ఈ సమయంలో అత్యధిక ఉష్ణోగ్రతలు, వేడి మరియు పొడి గాలులు వీచే అవకాశం ఉంటుందని తెలిపింది. ఇటీవలి రోజుల్లో 13 గంటల 50 నిమిషాలకు పైగా ఉన్న పగటి సమయం ఇకపై క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుందని, అదే సమయంలో రాత్రి వేళలు నెమ్మదిగా పెరుగుతాయని కేంద్రం వెల్లడించింది.
జూలై నెలలో పలు ఖగోళ విశేషాలు కూడా చోటుచేసుకోనున్నాయని పేర్కొంది. జూలై 16న చంద్రుడు శని గ్రహానికి, జూలై 17న శుక్రగ్రహానికి అత్యంత సమీపంలో కనిపిస్తాడు. జూలై 17న సాయంత్రం 7:04 గంటల సమయంలో కువైట్ ఆకాశంలో శుక్రగ్రహాన్ని స్పష్టంగా వీక్షించే అవకాశం ఉందని తెలిపింది.
అలాగే జూలై 29న 'డియర్ మూన్' (Deer Moon) పేరుతో పౌర్ణమి ఏర్పడనుంది. ఉత్తర అమెరికా స్థానిక ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం, ఈ కాలంలో జింకలకు కొత్త కొమ్ములు పెరగడం ప్రారంభమవుతుండటంతో ఈ పౌర్ణమికి 'డియర్ మూన్' అనే పేరు వచ్చిందని అల్-ఉజైరి సైంటిఫిక్ సెంటర్ వివరించింది.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







