గల్ఫ్ కు వెళ్లిన సదరు మహిళకు అక్కడి దుర్భర జీవనం..
- August 13, 2016
హైదరాబాద్ నగరానికి చెందిన 30 ఏళ్ల ఓ మహిళ పొట్ట కూటి కోసం విదేశాల్లో ఇంటి పనిమనిషిగా పనిచేసేందుకు ఏజెంటు ద్వారా గల్ఫ్ దేశమైన దుబాయ్ కు పయనమైంది...అలా వెళ్లిన ఆ మహిళను సాక్షాత్తు పనిలో పెట్టుకున్న యజమానే లైంగికంగా వేధించడం ఆరంభించాడు...కొట్టడంతోపాటు భోజనం పెట్టకుండా గదిలో నిర్భందించాడు. అక్కడి నుంచి ఆమెను మస్కట్ కు తీసుకువెళ్లి వ్యభిచారం వృత్తిలో దించాడు... ఇంటిపనిచేసి సంపాదించి కుటుంబానికి ఆసరాగా నిలుద్దామని గల్ఫ్ కు వెళ్లిన సదరు మహిళకు అక్కడి దుర్భర జీవనంతో విసిగివేసారి మన భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించింది. అంతే మన రాయబార కార్యాలయ అధికారులు స్పందించి బాధిత మహిళను వ్యభిచార కూపం నుంచి రక్షించి స్వదేశానికి తరలించారు. ఇలాంటి సంఘటనలు గల్ఫ్ దేశాల్లో ఒకటి కాదు రెండు కాదు ప్రతినిత్యం సాగుతున్నాయి.ఇంటి పనిమనుషుల పేరిట గల్ఫ్ కు అమ్మాయిల అక్రమ రవాణా చేయడానికి తాజా కేంద్ర నిర్ణయంతో తెరపడనుంది.మహిళా ఇంటిపనిమనుషుల గల్ఫ్ రిక్రూట్ మెంట్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రిక్రూటింగ్ ఏజెన్సీల ద్వారానే చేయాలని తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మహిళల అక్రమ రవాణాపై వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన కేంద్రం ఇకపై ప్రైవేటు ఏజెంట్ల ద్వారా ఇంటి పనిమనుషుల రిక్రూట్ మెంట్ చేయడానికి వీల్లేకుండా నిషేధం విధించింది. 18 దేశాలకు వెళ్లే ఇంటి పనిమనుషుల రిక్రూట్ మెంట్ ఇకనుంచి ప్రభుత్వం ఆధీనంలోని ఆరు ఏజెన్సీలు మాత్రమే చేస్తాయని రూట్స్ అండ్ ఓవర్ సీస్ డెవలప్ మెంట్ ఎంప్లాయ్ మెంట్ ప్రమోషన్ కార్యదర్శి ఉషా టిటూస్ చెప్పారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







