బాలాదిత్య పెళ్లి వేడుక
- August 13, 2016
బాలనటుడిగా కెరీర్‌ను ప్రారంభించి హీరోగా మంచి సినిమాలు చేసిన బాలాదిత్య ఓ ఇంటివాడయ్యాడు. జూబ్లీహిల్స్‌లోని తాజ్‌మహల్ హోటల్లో బాలాదిత్య పెళ్లి వేడుక జరిగినట్లు నటుడు శివబాలాజీ సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. పెళ్లి వేడుకలో నూతన దంపతులతో కలిసి దిగిన ఫొటోను శివబాలాజీ పోస్ట్ చేస్తూ.. శుభాకాంక్షలు తెలిపారు.
'ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం' సినిమాతో బాలనటుడిగా సినీ రంగానికి పరిచయమైన బాలాదిత్య 'అన్న', 'లిటిల్‌సోల్జర్స్', 'బంగారు బుల్లోడు', 'హిట్లర్', 'అబ్బాయిగారు', 'ఏవండీ ఆవిడ వచ్చింది', 'హలో బ్రదర్' వంటి చిత్రాల్లో నటించారు. చంటిగాడు చిత్రంతో హీరోగా తెరంగేట్రం చేసి రూమ్ మేట్స్, 1940లో ఒక గ్రామం తదితర చిత్రాల్లో నటించారు. ఇంతేకాదు బాలాదిత్య డబ్బింగ్ కళాకారుడిగా, వ్యాఖ్యాతగా, గేయరచయితగా కూడా పేరు తెచ్చుకున్నారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







