ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్లపై దాడులు..ఒకరు మృతి, ముగ్గురు గల్లంతు..!!
- July 15, 2026
మస్కట్: ఒమన్ తీర ప్రాంతంలో మూడు చమురు ట్యాంకర్లే లక్ష్యంగా వేర్వేరుగా జరిగిన వరుస దాడులు అంతర్జాతీయంగా కలకలం సృష్టించాయి. ఈ ఘోర దాడుల్లో ఒక సిబ్బంది మరణించగా, మరో ముగ్గురు గల్లంతయ్యారు. ఒమన్ మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ (రక్షణ విభాగం) ఈ వివరాలను వెల్లడించింది.
సౌత్ అల్ షర్కియా గవర్నరేట్ తీరానికి దాదాపు 40 నాటికల్ మైళ్ల దూరంలో ప్రయాణిస్తున్న లైబీరియా జెండాతో ఉన్న ‘స్టోల్ట్ మెగ్నీషియం’ (STOLT MAGNESIUM) చమురు ట్యాంకర్‌పై దాడి జరిగింది. ఓడ ఇంజన్ రూమ్‌లో పేలుడు సంభవించి భారీగా మంటలు చెలరేగాయి. అయితే, అందులోని 23 మంది సిబ్బందిని రెస్క్యూ చేశామని, వారంతా ఆరోగ్యంగా ఉన్నారని అధికారులు తెలిపారు. అలాగే, ముసండమ్ గవర్నరేట్ తీరానికి 8.5 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న ‘మొంబాసా బి’ (MOMBASA B) అనే మరో లైబీరియా ట్యాంకర్‌పై జరిగింది. ఓడలోని 21 మంది సిబ్బందిని రక్షించగా, వారిలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. రాయల్ నేవీ ఆఫ్ ఒమన్ (RNO) నౌక ప్రస్తుతం అక్కడ పరిస్థితిని పర్యవేక్షిస్తోందన్నారు.
అదే విధంగా యూఏఈ (UAE)కి చెందిన సంస్థ యాజమాన్యంలోని, లైబీరియా జెండాతో ప్రయాణిస్తున్న ‘అల్ బహ్యా’ (AL BAHYAH) ట్యాంకర్‌పై ముసండమ్ తీరానికి 9.6 నాటికల్ మైళ్ల దూరంలో జరిగింది. ఈ ఓడ నుండి 18 మంది సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చినప్పటికీ, మరో ముగ్గురు సిబ్బంది గల్లంతయ్యారు. వారి కోసం రాయల్ నేవీ ఆఫ్ ఒమన్ గాలింపు చర్యలు చేపట్టిందని తెలిపారు.సముద్ర మార్గాల్లో ప్రయాణించే సిబ్బంది భద్రత మరియు పరిణామాలను పర్యవేక్షిస్తున్నట్లు స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







