ఎలక్ట్రిక్ బైక్ వల్ల భారీ అగ్నిప్రమాదం..
- July 15, 2026
నోయిడా: నేటి కాలంలో ఈవీ (ఎలక్ట్రిక్ వాహనాలు) వాడకం పెరుగుతున్నప్పటికీ, వాటి వల్ల జరిగే ప్రమాదాలు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఒక ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలడం వల్ల సంభవించిన ఘోర అగ్నిప్రమాదం ఇద్దరు ప్రాణాలను బలితీసుకుంది. మామురా గ్రామంలో బుధవారం చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక బహుళ అంతస్తుల భవనం గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్‌లో ఉంచిన ఎలక్ట్రిక్ బైక్‌లో ఒక్కసారిగా నిప్పురవ్వలు చెలరేగి మంటలు(Noida Fire Incident) వ్యాపించాయి. చూస్తుండగానే మంటలు, దట్టమైన పొగ భవనం పైకి చేరడంతో నివాసితులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే ఏడు అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది రంగంలోకి దిగి 50 కుటుంబాలను సురక్షితంగా రక్షించారు.
ఈ ఘోర ప్రమాదం పై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆరా తీశారు. బాధితులకు తక్షణమే మెరుగైన సహాయక, వైద్య చర్యలు అందించాలని అధికారులను ఆదేశించారు. పార్కింగ్ ఏరియా నుంచి పొగ వేగంగా పై అంతస్తులకు వ్యాపించడమే ఈ ప్రాణనష్టానికి ప్రధాన కారణమని జాయింట్ కమిషనర్ రాజీవ్ నారాయణ్ వెల్లడించారు. ఈ ప్రమాదం ఈవీ వాహనాల భద్రతపై మరోసారి ఆందోళనలను రేకెత్తించింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







