రూ.100కు చేరువలో డాలర్‌.. ప్రవాసులకు భారీ లాభం..!!

- July 15, 2026 , by Maagulf
రూ.100కు చేరువలో డాలర్‌.. ప్రవాసులకు భారీ లాభం..!!

మస్కట్: దాదాపు రెండు నెలలుగా స్థిరంగా కొనసాగిన భారత రూపాయి విలువ అమెరికా డాలర్‌తో పోలిస్తే రూ.100 మార్కుకు చేరువవుతుంది.  మంగళవారం రూపాయి డాలర్‌కు ₹95.92 వద్ద ప్రారంభమై, 96.43 వద్ద ముగిసింది.  అదే సమయంలో ఒమాన్‌లోని కరెన్సీ ఎక్స్చేంజ్ కేంద్రాల్లో ఒక ఒమానీ రియాల్‌కు సుమారు ₹250.17 లభిస్తోంది. దీంతో స్వదేశానికి డబ్బు పంపే ఒమాన్‌లోని భారతీయ ప్రవాసులకు ప్రతి రియాల్‌పై మరింత ఎక్కువ రూపాయలు అందుతున్నాయి.

ప్రవాసులకు అదనపు లాభం

అమెరికా డాలర్‌కు అనుసంధానమైన ఒమానీ రియాల్ గత రెండేళ్లలో భారత రూపాయితో పోలిస్తే గణనీయంగా బలపడింది. 2024లో ఒక ఒమానీ రియాల్ సగటున ₹220 విలువ ఉండేది.  ప్రస్తుతం అదే రియాల్ ₹247–₹250 మధ్య ట్రేడవుతోంది.  అంటే రెండు సంవత్సరాల్లో సుమారు 15 శాతం మేర విలువ పెరిగింది.

రూపాయి ఎందుకు బలహీనపడుతోంది?

మస్కట్‌కు చెందిన ఆర్థిక నిపుణుడు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మాజీ అధికారి అడ్వకేట్ ఆర్. మధుసూదనన్ ప్రకారం, పలు అంతర్జాతీయ పరిణామాలు రూపాయిపై ఒత్తిడి పెంచుతున్నాయి.

మరోవైపు పశ్చిమాసియాలో భౌగోళిక ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, అమెరికా డాలర్‌కు పెరుగుతున్న డిమాండ్, భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ కారణంగా రూపాయి విలువ క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 85 డాలర్లకు పైగా ఉండగా, అమెరికా డాలర్ ఇండెక్స్ కూడా 101.24వద్ద కొనసాగుతోందని ఆయన తెలిపారు.

భారత్‌కు పెరిగే భారం

యుద్ధ ముప్పు కారణంగా సముద్ర రవాణా వ్యయాలు, బీమా ప్రీమియంలు పెరగడంతో చమురు దిగుమతుల ఖర్చు అధికమవుతుందని, దీని వల్ల భారత కరెంట్ అకౌంట్ లోటు (Current Account Deficit) మరింత పెరిగే అవకాశం ఉందని మధుసూదనన్ చెప్పారు. అలాగే చమురు దిగుమతులపై ఆధారపడిన భారత్ వంటి దేశాల్లో ద్రవ్యోల్బణ ఒత్తిడి కూడా పెరగవచ్చని ఆయన పేర్కొన్నారు.

ఆర్బీఐ చర్యలు

రూపాయి విలువలో తీవ్ర హెచ్చుతగ్గులు రాకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)** విదేశీ మారక మార్కెట్లో జోక్యం చేసుకుంటోందని ఆయన తెలిపారు. అలాగే FCNR(B) డిపాజిట్ల నిబంధనలను సడలించడం వంటి చర్యలతో భారత విదేశీ మారక నిల్వలు దాదాపు  బిలియన్ డాలర్లు పెరిగి 674 బిలియన్ డాలర్లకు చేరాయని చెప్పారు.

అయితే విదేశీ పెట్టుబడిదారులు భారత మార్కెట్ల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకోవడం రూపాయిపై ఇంకా ఒత్తిడిని కొనసాగిస్తోందని వివరించారు. రూపాయి బలహీనపడటం వల్ల ప్రవాస భారతీయులు స్వదేశానికి పంపే నగదుకు ఎక్కువ రూపాయలు లభిస్తున్నప్పటికీ, విదేశీ పర్యటనలు, విదేశాల్లో వైద్య చికిత్స, విదేశీ విద్య ఖర్చులు, విదేశీ కరెన్సీలో తీసుకున్న రుణాల చెల్లింపులు మరింత భారంగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


కాగా, సమీప భవిష్యత్తులో రూపాయి విలువలో హెచ్చుతగ్గులు కొనసాగవచ్చని, పశ్చిమాసియా పరిస్థితులు మరియు ఆర్బీఐ తీసుకునే చర్యలపై రూపాయి దిశ ఆధారపడి ఉంటుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com