ఆర్థిక, పెట్టుబడి సహకారంపై బహ్రెయిన్–ఫ్రాన్స్ చర్చలు..!!
- July 16, 2026
మనామా: ఆర్థిక, పెట్టుబడి సహకారంపై బహ్రెయిన్–ఫ్రాన్స్ చర్చలు జరిపాయి. బహ్రెయిన్ ఆర్థిక, జాతీయ ఆర్థిక వ్యవహారాల మంత్రి షేక్ సల్మాన్ బిన్ ఖలీఫా అల్ ఖలీఫా.. ఫ్రాన్స్ రాయబారి ఎరిక్ గిరాడ్-టెల్మేతో సమావేశమై ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఉన్న దీర్ఘకాలిక స్నేహపూర్వక సంబంధాలను మంత్రి ప్రస్తావిస్తూ, ముఖ్యంగా ఆర్థిక, వాణిజ్య, పెట్టుబడి రంగాల్లో సహకారం నిరంతరం విస్తరిస్తోందని తెలిపారు.
అలాగే, ఉమ్మడి లక్ష్యాల సాధన కోసం ద్వైపాక్షిక సమన్వయం, భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని పేర్కొన్నారు.ఈ సమావేశంలో తాజా ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా చర్చించారు. అలాగే ఆర్థిక, పెట్టుబడి రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించే అవకాశాలను పరిశీలించారు.
తాజా వార్తలు
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!







