సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- July 19, 2026
రియాద్: సౌదీ అరేబియాలోని భూ, సముద్ర, విమానాశ్రయ కస్టమ్స్ కేంద్రాల్లో మొత్తం 1,131 స్మగ్లింగ్ యత్నాలను అడ్డుకున్నట్లు జకాత్, ట్యాక్స్ అండ్ కస్టమ్స్ అథారిటీ (ZATCA) వెల్లడించింది. కస్టమ్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో హషీష్, కొకైన్, హెరాయిన్, మెథాంఫెటమైన్ (షాబు), క్యాప్టాగాన్ మాత్రలు సహా మొత్తం 118 రకాల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు 402 నిషేధిత వస్తువులను కూడా గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
అలాగే 2,478 పొగాకు మరియు పొగాకు సంబంధిత ఉత్పత్తుల అక్రమ రవాణాను అడ్డుకున్నట్లు ZATCA వెల్లడించింది. అంతేకాకుండా ప్రకటించని నగదుకు సంబంధించిన 25 కేసులు, ఆయుధాలు మరియు వాటికి సంబంధించిన పరికరాల అక్రమ రవాణాకు సంబంధించిన 9 కేసులను కూడా గుర్తించినట్లు తెలిపింది. దిగుమతులు, ఎగుమతులపై మరింత కట్టుదిట్టమైన నిఘా కొనసాగిస్తూ, సంబంధిత ప్రభుత్వ సంస్థలతో సమన్వయంగా పనిచేసి దేశ భద్రతతో పాటు సమాజ రక్షణకు కట్టుబడి ఉన్నామని అథారిటీ పేర్కొంది.
అక్రమ రవాణాపై ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం అందించాలని విజ్ఞప్తి చేసింది. అందిన సమాచారం గోప్యంగా ఉంచబడుతుందని, నిజమైన కస్టమ్స్ ఉల్లంఘన వెలుగులోకి వస్తే సమాచారం అందించిన వారికి నగదు బహుమతి కూడా అందజేస్తామని వెల్లడించింది.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







