యూఏఈలో సీబీఎస్‌ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!

- July 19, 2026 , by Maagulf
యూఏఈలో సీబీఎస్‌ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!

దుబాయ్: యూఏఈలోని సీబీఎస్‌ఈ గ్రేడ్ 10 విద్యార్థుల నెలల తరబడి ఉత్కంఠకు తెరపడింది. బోర్డు పరీక్షల తుది మార్కుల మెమోలు (మార్క్‌ షీట్లు) విడుదల కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి సీబీఎస్‌ఈ అమలు చేసిన రెండు దశల పరీక్షా విధానం ప్రకారం, విద్యార్థులకు గరిష్టంగా మూడు సబ్జెక్టుల్లో మార్కులు మెరుగుపరుచుకునేందుకు మే నెలలో మరోసారి పరీక్షలు రాసే అవకాశం కల్పించింది. తుది మార్క్‌షీట్‌లో రెండు పరీక్షల్లో వచ్చిన మార్కుల్లో అత్యధిక మార్కులను పరిగణనలోకి తీసుకుంది.

మిడిలీస్టు యుద్ధ పరిస్థితుల కారణంగా యూఏఈలో కొన్ని బోర్డు పరీక్షలు రద్దు కావడంతో సీబీఎస్‌ఈ ప్రత్యేక మూల్యాంకన విధానాన్ని అమలు చేసింది. పరీక్షలు జరగని సబ్జెక్టులకు ఇప్పటికే రాసిన పరీక్షల సగటు మార్కుల ఆధారంగా ఫలితాలను నిర్ణయించింది. ఆవర్ ఓన్ బాయ్స్ స్కూల్ అల్ వార్కా విద్యార్థి సాహిల్ సజీద్ లతీఫ్ మాట్లాడుతూ.. పరీక్షల రద్దు ఒకవైపు నిరాశ కలిగించినా, మరోవైపు ఒత్తిడిని తగ్గించిందన్నారు. కామర్స్ విత్ మ్యాథమెటిక్స్‌ను ఎంపిక చేసుకున్నా.. భవిష్యత్తులో చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ కోర్సు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఇండియన్ హై స్కూల్, దుబాయ్ విద్యార్థి హారూన్ రాయ్ తట్టిల్ కూడా యుద్ధ పరిస్థితుల కారణంగా రెండు పరీక్షలు రాయలేకపోయినా, ప్రత్యేక మూల్యాంకన విధానం వల్ల మంచి ఫలితాలు సాధించినట్లు తెలిపాడు. వుడ్లెమ్ పార్క్ స్కూల్ విద్యార్థి నిరంజన్ కన్నత్ రెండో భాష, సోషల్ స్టడీస్ పరీక్షలకు హాజరుకాలేకపోయినా, ప్రస్తుతం హ్యూమానిటీస్‌ను ఎంపిక చేసుకుని సైకాలజీ, ఎంటర్‌ప్రెన్యూరియల్ మేనేజ్‌మెంట్‌లో ఉన్నత విద్యను అభ్యసించాలని నిర్ణయించుకున్నాడు.

అయితే స్వాతి శరుణ్ అనే విద్యార్థిని మాత్రం తన ఫలితాలపై మిశ్రమ భావనలు వ్యక్తం చేసింది. పరీక్షలు పూర్తిగా జరిగి ఉంటే మరింత మెరుగైన మార్కులు సాధించేదానినని పేర్కొంది. అయినప్పటికీ, మే నెలలో నిర్వహించిన మెరుగుదల పరీక్షలకు హాజరు కాలేదని, భవిష్యత్తులో న్యూరోసైకాలజీలో కెరీర్‌ను కొనసాగించాలని ఆశిస్తున్నట్లు తెలిపింది.

దాదాపు 680,000 మంది స్టూడెంట్స్ తుది మార్క్‌షీట్లు విడుదల కావడంతో యూఏఈలోని విద్యార్థులు ఇప్పుడు తమకు నచ్చిన విద్యా విభాగాలను ఎంచుకుని, భవిష్యత్ విద్య, ఉద్యోగ లక్ష్యాలపై స్పష్టమైన ప్రణాళికలు రూపొందించుకునే అవకాశం లభించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com