చేపల మార్కెట్‌లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- July 19, 2026
కువైట్ సిటీ: కువైట్ ఫుడ్ మరియు న్యూట్రిషియన్ అథారిటీ (PAFN) అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో చేపల మార్కెట్‌లో నిర్వహించిన తనిఖీల్లో 3.2 టన్నులకు పైగా వినియోగానికి అనర్హమైన చేపలను స్వాధీనం చేసుకుంది. తనిఖీల సందర్భంగా మొత్తం 3 టన్నులు 237 కిలోల చేపలు కుళ్లిపోయినట్లు అధికారులు గుర్తించారు. వాటి సహజ రంగు, ఆకారం, వాసన పూర్తిగా మారిపోవడంతో పాటు దుర్వాసన వస్తున్నట్లు వెల్లడించారు. ఈ చేపలను వినియోగదారులకు విక్రయించేందుకు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనకు బాధ్యులపై ఉల్లంఘన కేసులు నమోదు చేసినట్లు పీఏఎఫ్‌ఎన్ వెల్లడించింది. ప్రజారోగ్య పరిరక్షణ దృష్ట్యా స్వాధీనం చేసుకున్న చేపలను నిబంధనల ప్రకారం పూర్తిగా ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఆహార పదార్థాల విక్రయంపై ఎలాంటి రాజీ ఉండదని, ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







