జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- July 20, 2026
మస్కట్: ప్రాంతీయ భద్రత, స్థిరత్వంపై నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బద్ర్ బిన్ హమద్ అల్ బుసైదీ.. జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో వేర్వేరుగా టెలిఫోన్ ద్వారా చర్చలు జరిపారు.
మొదట జోర్డాన్ ఉప ప్రధాని, విదేశాంగ మరియు ప్రవాసీ వ్యవహారాల మంత్రి అయ్మన్ సఫాదీ తో మాట్లాడిన అల్ బుసైదీ.. ప్రాంతీయ పరిణామాలు మరియు వాటి ప్రభావంపై అభిప్రాయాలు పంచుకున్నారు. ఉద్రిక్తతలను తగ్గించేందుకు రాజకీయ ప్రయత్నాలను మరింత వేగవంతం చేయాలని, దౌత్య, శాంతియుత పరిష్కారాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. అలాగే, అంతర్జాతీయ చట్టాలను గౌరవించడం, సముద్ర రవాణా స్వేచ్ఛను పరిరక్షించడం, అన్ని దేశాల ప్రయోజనాలను కాపాడడం, దేశాల సార్వభౌమత్వం, స్థిరత్వాన్ని నిలబెట్టడం అత్యంత ముఖ్యమని వారు పేర్కొన్నారు.
అనంతరం ఖతార్ ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీతో కూడా ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ప్రాంతీయ పరిస్థితులు, ఉద్రిక్తతలను తగ్గించేందుకు కొనసాగుతున్న మధ్యవర్తిత్వ ప్రయత్నాలు, సంబంధిత పక్షాల మధ్య అవగాహనకు దోహదపడే చర్యలపై చర్చించారు. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి గుండా నౌకాయాన స్వేచ్ఛ, ప్రపంచ సఫ్లై చైన్ లను సాధారణ స్థితికి తీసుకురావడం అవసరమని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిణామాలపై పరస్పర సంప్రదింపులు కొనసాగించడంతో పాటు, ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిలో సమన్వయంతో ఉద్రిక్తతలకు మూల కారణాలను పరిష్కరించి శాంతిని నెలకొల్పాల్సిన అవసరాన్ని ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయి.
తాజా వార్తలు
- తమ కార్యకలాపాలను నిలిపివేయాలని టాటా కెమికల్స్‌ను ఆదేశించిన కెన్యా అధ్యక్షుడు
- ఖతార్‌లో భారత తదుపరి రాయబారిగా బాధ్యతలు చేపట్టనున్న డా.శ్రీకర్ రెడ్డి కొప్పుల
- Dh120,000 రుణం చెల్లించాలి..మరో Dh15,000 పరిహారం ఇవ్వాలన్న అబుదాబి కోర్టు
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- ఉపాధ్యాయులందరికి ‘ఉపాధ్యాయ దినోత్సవం’ శుభాకాంక్షలు.. సీఎం చంద్రబాబు
- బహ్రెయిన్‌లో ‘శ్రావణం 2026’ షెడ్యూల్.. ఘనంగా ఓణం వేడుకలు..!!
- మెడికల్ ఎమర్జెన్సీ.. దోహా–బెంగళూరు ఇండిగో విమానం మస్కట్‌కు మళ్లింపు..!!
- రెండో EU–GCC సదస్సుకు సౌదీ అరేబియా ఆతిథ్యం..!!
- ఖతార్ లో పబ్లిక్ ప్రాసిక్యూషన్–స్టేట్ ఆడిట్ బ్యూరో మధ్య కీలక ఒప్పందం..!!
- యూఏఈలో అక్టోబర్ హాఫ్‌టర్మ్ సెలవులు ముందుకు.. పేరెంట్స్ అసంతృప్తి..!!







