ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- July 20, 2026
మనామా: బహ్రెయిన్‌లో ప్రజా రవాణా వ్యవస్థను మరింత సమర్థవంతంగా, సురక్షితంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ప్రజా బస్సు సేవలను దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే ప్రణాళికపై రవాణా మరియు టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ దృష్టి సారించింది. ల్యాండ్ ట్రాన్స్ పోర్ట్ అండర్‌సెక్రటరీ ఫాతిమా అబ్దుల్లా అల్ జాయెన్ పబ్లిక్ బస్ డిపోను సందర్శించి, బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ అధికారులతో కలిసి ప్రస్తుత నిర్వహణ, భవిష్యత్ ప్రణాళికలను సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బహ్రెయిన్ ప్రజా రవాణా నెట్వర్క్ నిరంతరం మెరుగుపడుతోందని, ప్రయాణికుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోందని తెలిపారు. అన్ని పరిస్థితుల్లోనూ నాణ్యమైన సేవలు అందించే సామర్థ్యం ప్రజా రవాణా వ్యవస్థకు ఉందని పేర్కొన్నారు. డిపోలో ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను కూడా ఆమె పరిశీలించారు. ఇది 2060 నాటికి కార్బన్ న్యూట్రాలిటీ సాధించాలనే బహ్రెయిన్ లక్ష్యంలో భాగంగా అమలు చేస్తున్న సమగ్ర, పర్యావరణహిత రవాణా వ్యవస్థ నిర్మాణానికి కీలక అడుగుగా భావిస్తున్నారు.
అలాగే, యూకేకు చెందిన అంతర్జాతీయ ప్రజా రవాణా సంస్థ మొబికో గ్రూప్ (Mobico Group) అనుభవాన్ని వినియోగించుకోవాలని అధికారులు నిర్ణయించారు. స్వచ్ఛ ఇంధన వాహనాల సాంకేతికత, బస్సు డిపోలను ఎలక్ట్రిక్ మౌలిక వసతులతో అభివృద్ధి చేయడంలో ప్రపంచ ప్రమాణాలను అనుసరించే అంశాలపై చర్చించారు.
తాజా వార్తలు
- Dh120,000 రుణం చెల్లించాలి..మరో Dh15,000 పరిహారం ఇవ్వాలన్న అబుదాబి కోర్టు
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- ఉపాధ్యాయులందరికి ‘ఉపాధ్యాయ దినోత్సవం’ శుభాకాంక్షలు.. సీఎం చంద్రబాబు
- బహ్రెయిన్‌లో ‘శ్రావణం 2026’ షెడ్యూల్.. ఘనంగా ఓణం వేడుకలు..!!
- మెడికల్ ఎమర్జెన్సీ.. దోహా–బెంగళూరు ఇండిగో విమానం మస్కట్‌కు మళ్లింపు..!!
- రెండో EU–GCC సదస్సుకు సౌదీ అరేబియా ఆతిథ్యం..!!
- ఖతార్ లో పబ్లిక్ ప్రాసిక్యూషన్–స్టేట్ ఆడిట్ బ్యూరో మధ్య కీలక ఒప్పందం..!!
- యూఏఈలో అక్టోబర్ హాఫ్‌టర్మ్ సెలవులు ముందుకు.. పేరెంట్స్ అసంతృప్తి..!!
- కువైట్‌లో డీజిల్ చోరీ.. 41 మంది అరెస్ట్..!!
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్







