డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- July 21, 2026
మనామా: డొమెస్టిక్ వర్కర్ ని బలవంతంగా పని చేయించి, ఆమె వేతనాలను స్వాధీనం చేసుకున్న కేసులో ఓ ఆసియా మహిళకు విధించిన మూడేళ్ల జైలు శిక్షతో పాటు BD2,000 జరిమానాను** బహ్రెయిన్ కోర్ట్ ఆఫ్ కసేషన్ (Court of Cassation) ఖరారు చేసింది. అదేవిధంగా, బాధిత మహిళను ఆమె స్వదేశానికి పంపించే ఖర్చును కూడా నిందితురాలే భరించాలని కోర్టు ఆదేశించింది.
కోర్టు పత్రాల ప్రకారం, 2024 జనవరి నుంచి 2025 జనవరి వరకు 20 ఏళ్ల డొమెస్టిక్ వర్కర్ ను మొత్తం తొమ్మిది వేర్వేరు కుటుంబాల వద్ద పని చేయించారు. మొదటి రెండు నెలలు మినహా మిగతా కాలంలో ఆమెకు ఎలాంటి వేతనం చెల్లించలేదు. అంతేకాకుండా, ఆమె పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకుని, ఆమెకు రావాల్సిన వేతనాలను కూడా నిందితురాలు అక్రమంగా తీసుకున్నట్లు విచారణలో వెల్లడైంది.
ఈ కేసుపై బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of Interior) మరియు లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) సంయుక్తంగా దర్యాప్తు చేపట్టాయి. విచారణలో మానవ అక్రమ రవాణా (Human Trafficking) మరియు అనుమతి లేకుండా కార్మికుల నియామకం జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయి. ఈ నేపథ్యంలో దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును బహ్రెయిన్ కోర్ట్ ఆఫ్ కసేషన్ సమర్థిస్తూ, నిందితురాలి శిక్షను యథాతథంగా కొనసాగించింది.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







