వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- July 21, 2026
కువైట్ సిటీ: షాపులు, మాల్స్ లేదా ఇతర వాణిజ్య స్థలాలను అద్దెకు తీసుకునే ముందు ఆ భవనానికి చెల్లుబాటు అయ్యే ఫైర్ లైసెన్స్ (Fire Licence) ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించాలని కువైట్ జనరల్ ఫైర్ ఫోర్స్ (GFF) పెట్టుబడిదారులు, వ్యాపారులు మరియు అద్దెదారులకు సూచించింది.
భవన యజమాని పేరుతో చెల్లుబాటు అయ్యే ఫైర్ లైసెన్స్ ఉంటే, అద్దెదారులు తమ వ్యాపారం కోసం అవసరమైన ఫైర్ లైసెన్స్‌ను సులభంగా పొందగలరని, తద్వారా వ్యాపార కార్యకలాపాలు ఎలాంటి జాప్యం లేకుండా ప్రారంభించవచ్చని జనరల్ ఫైర్ ఫోర్స్ ప్రజాసంబంధాలు, మీడియా విభాగం డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ అల్-ఘరీబ్ తెలిపారు.
అగ్నిప్రమాదాల నివారణ, భద్రతా ప్రమాణాలపై ప్రజల్లో అవగాహన పెంచడం, అలాగే నిబంధనలను పాటించేలా ప్రోత్సహించడమే జనరల్ ఫైర్ ఫోర్స్ నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని ఆయన తెలిపారు. భద్రతా నిబంధనలను పాటించడం ద్వారా ప్రాణాలు, ఆస్తులను రక్షించడమే కాకుండా సురక్షితమైన పని వాతావరణం ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు.
అంతేకాకుండా, వాణిజ్య సంస్థల్లో ప్రమాదాలను తగ్గించేందుకు, భద్రతను మెరుగుపరచేందుకు జనరల్ ఫైర్ ఫోర్స్ తరచూ విడుదల చేసే ఫైర్ సేఫ్టీ మార్గదర్శకాలను ప్రజలు తప్పనిసరిగా అనుసరించాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







