బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్
- July 21, 2026
షూటింగ్ లో నందమూరి బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితిపై దర్శకుడు గోపీచంద్ మలినేని స్పష్టత ఇచ్చారు. నందమూరి బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి చాలా నిలకడగా ఉందని, అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని ఆయన తెలిపారు. యాక్షన్ సీన్స్ తీస్తున్న సమయంలో కండరాల నరం దెబ్బతిన్నట్లు ఆయన పేర్కొన్నారు. దీనికోసం చిన్నపాటి శస్త్రచికిత్స అవసరమని డాక్టర్లు చెప్పారు.
షూటింగ్ సమయంలో జరిగిన గాయం
సినిమా షూటింగ్ సమయంలో యాక్షన్ సన్నివేశాలు తీస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. బాలయ్య బాబుకు కండరాల గాయం కావడంతో వెంటనే వైద్యులను సంప్రదించారు. డాక్టర్ల సలహా మేరకు చిన్న సర్జరీ చేయాలని నిర్ణయించారు. ఈ విషయం తెలిసిన అభిమానులు ఒక్కసారిగా టెన్షన్ పడ్డారు. అయితే ఎవరూ భయపడాల్సిన పనిలేదని చిత్ర యూనిట్ భరోసా ఇచ్చింది.
త్వరలోనే ప్రేక్షకుల ముందుకు బాలయ్య
వైద్యుల పర్యవేక్షణలో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. అన్ని పరీక్షలు పూర్తి అయిన తర్వాత త్వరలోనే మళ్లీ షూటింగ్ లో పాల్గొంటారు. సినిమా పనులు మళ్లీ వేగంగా మొదలుకానున్నాయి. ప్రేక్షకుల ముందుకు అలుపెరగకుండా వచ్చే మన అభిమాన హీరో పూర్తి ఆరోగ్యంతో త్వరలోనే తిరిగి వస్తారని అందరూ నమ్ముతున్నారు
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







