నడిమింటి నరసింగరావు.. గౌతమ్‌తో అల్లూరి సీతారామరాజు..
- August 14, 2016
ఓ ఎక్స్‌క్లూసివ్ న్యూస్.. మహేష్ బాబు తనయుడు గౌతమ్‌తో 'అల్లూరి సీతారామరాజు' తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయట. సూపర్ స్టార్ కృష్ణ 100వ సినిమాగా వచ్చిన అల్లూరి సీతారామరాజు సంచలన విజయం సాధించి ఆయన కెరీర్‌ని పీక్స్ తీసుకువెళ్ళింది. ఆ సినిమాలో ఆయన చేసిన పెర్ఫార్మెన్స్, కైమాక్స్‌లో చెప్పిన డైలాగ్స్ నేటికీ కృష్ణ అభిమానులనే కాకుండా చూసిన వారందరికీ రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తాయి. ఇప్పుడు ఆ చిత్రాన్ని కృష్ణ మనవడు గౌతమ్‌తో తెరకెక్కించాలని ఓ సీనియర్ రైటర్ ప్రయత్నం చేస్తున్నారు.కృష్ణవంశీ మొదటి సినిమా 'గులాబి', రామ్ గోపాల్ వర్మ 'అనగనగా ఒక రోజు' సినిమాల రైటర్ నడిమింటి నరసింగరావు.. గౌతమ్‌తో అల్లూరి సీతారామరాజు తెరకెక్కించే పనిలో వున్నారు. ఆయన ఈ సినిమా గురించి ఎంతో రీసెర్చ్ వర్క్ చేసి 'రామరాజు' స్వాతంత్ర్య పోరాట యోధుడిగా మారడానికి చిన్నతనంలో ఎటువంటి సంఘటనలు ప్రభావితం చేసాయి అనే కథాంశంతో 'శ్రీరామరాజు' స్క్రిప్ట్ రెడీ చేసారట. బాల్యం నుండి ఎనిమిదవ తరగతి చదివే వరకూ రామరాజు జీవితంలో జరిగిన సంఘటనలు.. వాటి వల్ల ప్రభావితమైన అతను స్వాతంత్ర పోరాట యోధుడిగా మారడం వంటి అంశాలున్న తన స్క్రిప్ట్‌కి గౌతం యాప్ట్ అని, అందుకే అతనితో చేసేందుకు ప్రయత్నాల్లో వున్నారని తెలుస్తోంది. ఇక తనని అల్లూరి సీతారామరాజు సినిమా ఎంతో ప్రభావితం చేసిందనే చెప్పే కృష్ణ వంశీ.. ఈ మూవీ డైరెక్ట్ చేయబోతున్నాడని తెలుస్తోంది. అన్నీ కుదిరితే.. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ తెరకెక్కబోతుందన్నమాట. అదే జరిగితే సూపర్ స్టార్ అభిమానులకు పండగే
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!







