ఖతార్ పాస్‌పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- July 23, 2026
దోహా: హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్–2026 (జూలై ఎడిషన్)లో ఖతార్ పాస్‌పోర్ట్ ప్రపంచవ్యాప్తంగా 48వ స్థానం సాధించింది. గల్ఫ్ దేశాల్లో యూఏఈ తర్వాత రెండో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌గా ఖతార్ నిలిచింది. ఖతార్ పాస్‌పోర్ట్ కలిగిన వారు 112 దేశాలకు వీసా-రహిత (Visa-Free) లేదా వీసా-ఆన్-అరైవల్ (Visa-on-Arrival) సౌకర్యంతో ప్రయాణించవచ్చు. ఈ జాబితాలో యూరప్‌లోని షెంగెన్ (Schengen) దేశాలు కూడా ఉన్నాయి.
ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌గా సింగపూర్ వరుసగా అగ్రస్థానంలో నిలిచి, 192 దేశాలకు వీసా-రహిత లేదా వీసా-ఆన్-అరైవల్ ప్రవేశాన్ని అందిస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), జపాన్, దక్షిణ కొరియా సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచి 188 దేశాలకు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి.
గల్ఫ్ దేశాల ర్యాంకింగ్స్‌లో కువైట్ 51వ స్థానం (97 దేశాలు), సౌదీ అరేబియా 54వ స్థానం (91 దేశాలు), బహ్రెయిన్ 55వ స్థానం (88 దేశాలు), ఒమన్ 58వ స్థానం (85 దేశాలు) దక్కించుకున్నాయి.
అంతర్జాతీయ వైమానిక రవాణా సంఘం (IATA)కు చెందిన టిమాటిక్ (Timatic) డేటా ఆధారంగా రూపొందించే హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రపంచంలోని199 పాస్‌పోర్ట్‌లను, 227 గమ్యస్థానాల ప్రాతిపదికన విశ్లేషించి ప్రయాణ స్వేచ్ఛను అంచనా వేస్తుంది. ఈ ఏడాది ప్రపంచ పాస్‌పోర్ట్‌ల సగటు వీసా-రహిత ప్రయాణ సామర్థ్యం 108 గమ్యస్థానాలకు పెరిగినట్లు ఇండెక్స్ వెల్లడించింది.
తాజా వార్తలు
- 18 మంది ఆసియా వాసులను అక్రమంగా తరలించే ప్రయత్నం భగ్నం
- ఖైరతాబాద్ వినాయకుడి తొలి పూజకు రావాలని గవర్నర్‌కు ఉత్సవ కమిటీ ఆహ్వానం
- పుతిన్‌కు ప్రధాని మోదీ అరుదైన కానుక!
- ట్రాన్స్జెండర్లకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్
- కువైట్‌లో భారీగా కల్తీ, నాణ్యత లేని ఆహారం ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో విద్వేష ప్రసంగాలకు కఠిన శిక్షలు..!!
- పర్యావరణహిత గణేశ ప్రతిమలతో పండుగ జరుపుకోవాలి: గవర్నర్ శివప్రతాప్
- వందే భారత్ ప్రయాణికులకు అలర్ట్!
- మక్కాలో ఐదుగురు పాకిస్థానీలు అరెస్ట్..!!
- బర్కా, యాంకుల్కు WHO ‘హెల్తీ సిటీ’ గుర్తింపు..!!







