వైజాగ్ లో మోహన్ బాబు 40 సినీ వసంతాల వేడుక
- August 14, 2016
సాధారణ వ్యక్తిగా తెలుగు ఇండస్ట్రీలోకి ప్రవేశించిన కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు అంచెలంచెలుగా ఎదిగి ఉన్నతి శిఖరాలను అధిరోహించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అభిమాన నటుడయ్యారు. నటజీవితంలో నలభై వసంతాలను పూర్తి చేసుకుని ఈ తరం నటులకు ఆదర్శప్రాయంగా నిలిచారు. నటుడిగా, నిర్మాత, విద్యావేత్తగా, రాజకీయవేత్తగా, అన్నింటికీ మించి మంచి మనసున్న వ్యక్తిగా ఇలా పలు రంగాల్లో తనదైన శైళిలో అద్భుతంగా రాణించి భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. అలాగే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుండి గౌరవ డాక్టరేటు అందుకున్నారు. ప్రస్తుతం కుమారులు విష్ణు, మనోజ్, కుమార్తె లక్ష్మీ ప్రసన్న మోహన్ బాబు అడుగు జాడల్లో నడుస్తూ సినీ రంగంలో రాణిస్తున్నారు.మోహన్ బాబు సినీ రంగంలో నటుడిగా 40 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు పలు కార్యక్రమాలను నిర్వహించారు. అంతే కాకుండా ఇప్పుడు టి.సుబ్బరామిరెడ్డి ఈ వేడుకను వైజాగ్ లో సెప్టెంబర్ 17న ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు పలువురు ఉత్తరాది, దక్షిణాదికి చెందిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారు. ఇప్పటి వరకు ఎవరూ జరపనంత ఘనమైన వేడుకను నిర్వహించాలని నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







